ఎవరు ఎన్ని ఫార్ములాలు చెప్పిన ఫిలిం ఇండస్ట్రీ అనేది సక్సెస్‌ వెంటే పరిగెడుతుంది. హిట్ ఇచ్చిన హీరో హీరోయిన్లు దర్శకుడు సాంకేతిక నిపుణుల కోసం నిర్మాతలు క్యూ కడతారు. అదే ఫెయిల్‌ అయ్యారా ఇక అంతే సంగతులు ఇండస్ట్రీ ఒక్కరు కూడా వారిని పట్టించుకోరు. అయితే సినిమా అనేది కోట్లకు సంబంధించిన వ్యవహారం, వ్యాపారం అయినప్పుడు అలా ఉండటంలో తప్పులేదంటరు మన మేకర్స్‌. అందుకే ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్లుగా ఓ వెలుగు వెలిగిన తారలు కూడా రీ ఎంట్రీలో పెద్దగా ఆకట్టుకోకపోవటంతో వారిని పక్కన పెట్టేశారు.

 

ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటి సిమ్రాన్‌. టాలీవుడ్‌, కోలీవుడ్‌లలో దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది ఈ భామ. తెలుగులో అయితే సిమ్రాన్‌ జోడి కట్టని స్టార్ హీరో నే లేడు. దాదాపు దశాబ్దం పాటు సౌత్‌ స్టార్‌ హీరోయిన్‌గా వెలిగిపోయింది సిమ్రాన్‌. కానీ తరువాత ఆమె కెరీర్‌లో గ్యాప్‌ వచ్చింది. పెళ్లి, ఫ్యామిలీ లైఫ్ అంటూ సినిమాలకు దూరమైంది. అదే సమయంలో కొత్త తరం హీరోయిన్లు సత్తా చాటటంతో సిమ్రాన్‌కు అవకాశాలు తగ్గాయి.


 రీ ఎంట్రీ కోసం చాలా ప్రయత్నించినా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు.  దీంతో కృష్ణ భగవాన్‌ లాంటి కమెడియన్‌ సరసన కూడా నటించింది. అయితే ఈ సినిమా కూడా డిజాస్టర్‌ కావటంతో సిమ్రాన్‌ కెరీర్‌కు తెరపడింది. తరువాత అడపాదడపా క్యారెక్టర్ రోల్స్‌ చేస్తున్నా ఒకప్పటి స్టార్ ఇమేజ్‌ మాత్రం ఇప్పుడు లేదు. ఒక్క సినిమా మాత్రమే కాదు మరో అందాల భామ రాశీ పరిస్థితి కూడా అదే. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోస్‌కు బెస్ట్‌ జోడి అనిపించుకున్న రాశీ తరువాత ఐటమ్‌ సాంగ్స్‌కు మారింది. ఆ తరువాత గ్యాప్‌ తీసుకొని రీ ఎంట్రీ ఇచ్చిన మునుపటి వైభవం మాత్రం రాలేదు.

 

మరో స్టార్ హీరోయిన్ మీనా కూడా రీ ఎంట్రీలో ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడి కట్టిన ఈ భామ తరువాత సీనియర్ హీరోల సరసన పలు చిత్రాల్లో నటించిన వరుస అవకాశాలు అందుకునే స్థాయిలో ప్రూవ్ చేసుకోలేకపోయింది. వీళ్లే కాదు అమల, ఆమని, గౌతమి లాంటి చాలా మంది సీనియర్‌ హీరోయిన్లది అదే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: