సినిమా లోకం అంటే మాయాజాలం వెళ్లే కొద్దీ లోతు తెలియదు.. సినిమా ఛాన్సులు రావడం చాలా కష్టం.. కానీ వచ్చిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా చాలా కష్టమే.. ఒక్క సినిమా ఛాన్స్ వస్తే ఆ ఛాన్సును నిలబెట్టుకోవడానికి ఎన్నో పాట్లు పడుతుంటారు. అయితే ఒక సినిమా హిట్ అయితే ఇక్కడ ఛాన్సులు అనేవి వెతుక్కుంటూ వస్తాయి. అది ఇప్పడు జరుగుతూ వస్తుంది కూడా.
ఇకపోతే సినిమా ఆవకాశాల కోసం ఇతర రాష్ట్రాల నుండి వచ్చి మరి సినిమాలలో నటించి సినిమాతోనే సొంత ఊర్లకు చెక్కేసిన బ్యూటీస్ ఎవరో చుడండి.. అందం ఉన్న కూడా అవకాశాలు లేక వెళ్ళిపోయినా ఎవరో చుడండి..
బిపాస బసు :
అందం చాలానే ఉంది. నటన కూడా చాలానే ఉంది.. కానీ మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాలో నటించింది. ఆ సినిమా హిట్ అవ్వక పోవడంతో మకాంను మార్చేసింది. అయితే తెలుగు సినిమాలలో ఎక్కడ కనిపించలేదు కేవలం ఒక్క సినితోనే బాలీవుడ్ కు పయనమైంది.
శిల్పాశెట్టి :
సాహస వీరుడు సాగర కన్య సినిమాలో నటించి నటి గా మంచి పేరు తెచ్చుకుంది.. అయితే ఈ సినిమా తర్వాత మారె సినిమాలో కనిపించలేదని అర్థం. బాలీవుడ్ నుంచి వచ్చిన ఈ అమ్మడు.. తిరిగి మళ్ళీ బాలీవుడ్ కు పయనమైంది..అక్కడ బాగా సక్సెస్ అయింది.
తాప్సి :
ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. తెలుగులో అడపాదడపా సినిమాల్లో నటించింది. కానీ ఏ ఒక్క సినిమా అమ్మడుకు హిట్ ని అందించకపోవడంతో తమిళ, హిందీ సినిమాలో నటించి ఎన్నో సక్సెస్ లను అందుకుంటూ వస్తుంది. తెలుగు నుండి వెళ్ళిపోయినా ఈ అమ్మడు మళ్ళీ తిరిగి మళ్ళీ తెలుగులోకి వచ్చే ఛాన్సెస్ లేవనే చెప్పాలి..
ఇలా చూసుకుంటే చాలా మంది హీరోయిన్లు ఒక్క సినిమాతోనే తెలుగులో అవకాశాలు లేఖ వచ్చిన దారిని పట్టుకొని వెళ్లిపోయారు. అందం ఉంటె సరిపోదు టాలెంట్ కూడా ఉంటేనే సక్సెస్ అనేది సొంతమవుతుంది అని కొందరు ప్రముఖులు అంటున్నారు.