ఎన్టీఆర్ త్రివిక్రమ్మూవీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించడంతో ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు ఈ స్క్రిప్ట్ వర్క్ పనులను పర్యవేక్షిస్తున్న త్రివిక్రమ్ ఈ సినిమాకు సంబంధించి కీలక నటీనటుల ఎంపిక విషయమై కూడ చాల శ్రద్ధ పడుతున్నట్లు తెలుస్తోంది. 


ఇలాంటి పరిస్థితులలో ఈ మూవీ హీరోయిన్ ఎంపిక విషయంలో త్రివిక్రమ్ సూచనలకు భిన్నంగా జూనియర్ ఆలోచనలు ఉన్నాయి అని అంటున్నారు. ఈ సినిమా కథ రీత్యా ఇద్దరు హీరోయిన్స్ ఉన్నప్పటికీ కథ మొత్తం కీలకంగా మెయిన్ హీరోయిన్ చుట్టూ తిరుగుతుంది అని సమాచారం. త్రివిక్రమ్ సినిమాలలో హీరొయిన్ పాత్రకు హీరోతో సమానంగా ప్రాతినిధ్యం ఉంటుంది అన్న విషయం తెలిసిందే.


వాస్తవానికి ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే లేకుంటే రష్మిక ను పెడితే బాగుంటుంది అన్న ఆలోచనలో త్రివిక్రమ్ మొదటి నుంచి ఉన్నట్లు సమాచారం. అయితే జూనియర్ మాత్రం ఎంతో కీలకమైన ఈ హీరోయిన్ పాత్రకు పూజా హెగ్డే రష్మిక లు సరిపోరని దీనికితోడు తన పక్కన రష్మిక పెద్దగా నప్పదు అన్న అభిప్రాయాన్ని జూనియర్ త్రివిక్రమ్ కు చెప్పినట్లు టాక్.


అంతేకాదు తన కెరియర్ కు సంబంధించి 30వ సినిమాగా తీయబడుతున్న ఈమూవీలో సమంత నటిస్తే ఈ మూవీ క్రేజ్ మరింత పెరుగుతుందని తారక్ అభిప్రాయం అని తెలుస్తోంది. జూనియర్ అభిప్రాయం తెలుసుకున్న త్రివిక్రమ్ ఇప్పుడు ఈ మూవీలో నటించడానికి సమంతను ఒప్పించే విధంగా రాయబారాలు చేస్తూ ఆమెకు ఇప్పటి వరకు ఆమె కెరియర్ లో ఎవరు ఇవ్వనంత భారీ పారితోషికాన్ని ఆఫర్ చేస్తున్నట్లు టాక్. దీనితో ఎప్పటి నుంచో తిరిగి టాప్ హీరోల సినిమాలలో నటించాలి అని ప్రయత్నాలు చేస్తున్న సమంత ఆలోచనలకు తనకు తెలియకుండానే జూనియర్ సహకారం లభించింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో టాప్ హీరోల సినిమాలలో సమంత రీ ఎంట్రీ ఖాయం అంటూ ఊహాగానాలు మొదలయ్యాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: