మెగాస్టార్ చిరంజీవి నటించిన అందరివాడు సినిమా అందరికి గుర్తుండే ఉంటుంది.  ఈ సినిమా మంచి విజయం సాధించింది. డబల్ రోల్ చేసిన ఈ సినిమాలో మెగాస్టార్ కు మంచి మార్కులు పడ్డాయి.  శ్రీను వైట్ల ఈ సినిమాను తీసిన విధానం మెచ్చుకోదగ్గది.  తండ్రి కొడుకులుగా మెగాస్టార్ చేసిన హంగామా అంతాఇంతా కాదు.  తండ్రి పాత్రలో మెగాస్టార్ అలరించిన సంగతి తెలిసిందే.  ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల మహేష్ బాబు తో చేసిన దూకుడు సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది.  


దూకుడు సినిమా మహేష్ కు బాగా కలిసి వచ్చింది.  దూకుడు సినిమాకు హాస్యాన్ని జోడించి, యాక్షన్ తో చేసిన హంగామా సూపర్ అని చెప్పొచ్చు.  ఈ సినిమా తరువాత మహేష్ బాబు కెరీర్లో మంచి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు.  అయితే, దూకుడు తరువాత శ్రీను వైట్లకు మరో అవకాశం ఇచ్చారు.  ఆ సినిమా ఆగడు.  ఈ సినిమాపై అప్పట్లో ఎన్నో కామెట్లు వచ్చాయి.  ఆగడు మూవీ ఆగకుండా పోయిందని చెప్పుకున్నారు.  


గత కొన్నేళ్లుగా శ్రీను వైట్లకు హిట్ లేదు.  కలిసి వచ్చిన వెంకీతో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.  శ్రీను వైట్ల కెరీర్ కు ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకున్నారు.  అయితే, ఇప్పుడు శ్రీనువైట్ల దూకుడు సినిమాకు సీక్వెల్ చేసేందుకు ట్రై చేస్తున్నారని, దూకుడు 2 సినిమా చేయడానికి రెడీ అవుతున్నారని సమాచారం.  దూకుడు 2 సినిమాను మెగాస్టార్ లేదా మహేష్ బాబుతో కలిసి చేసేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.  ఇద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేయాలనీ అనుకుంటున్నారట.  


అయితే, మెగాస్టార్, మహేష్ బాబులు ఫుల్ బిజీగా మారిపోయారు.  ఇద్దరిలో ఎవరూ శ్రీనువైట్లకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు.  కానీ, శ్రీనువైట్ల మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరితో ఈ సినిమాను వర్కౌట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.  ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.  ఈ సినిమా వర్కౌట్ అయితే, శ్రీనువైట్ల దశ తిరిగినట్టే.  చూద్దాం మరి వైట్లకు ఎవరు ఛాన్స్ ఇస్తారో. ఫుల్ స్క్రిప్ట్ వినకుండా మహేష్ ఎవరికి అవకాశం ఇవ్వడం లేదు.  మెగాస్టార్ కూడా అదే రూట్లో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: