రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు పవన్ తన సినిమా కెరియర్ ను ఏనాడు సీరియస్ గా తీసుకోలేదు. పవన్ మొదటి నుంచి వేగంగా సినిమాలు చేసి ఉంటే ఈ పాటికే అతడికి ఉన్న క్రేజ్ కు చాల సులువుగా 50 సినిమాలు చేసి ఉండేవాడు. అలాంటి పవన్ ఇప్పుడు మారిపోయి ఒకేసారి తన రీ ఎంట్రీ టైమ్ లో సమాంతరంగా నటిస్తూ అందరికీ షాక్ ఇస్తున్నాడు.


ఇప్పటికే పవన్ ‘పింక్’ రీమేక్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో మరొక మూవీలో కూడ నటిస్తూ మధ్యలో అమరావతి రాజకీయాలు చక్కపెడుతూ ఒక్క క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తున్నాడు. తెలుస్తున్న సమాచారం మేరకు పవన్ ప్రతిరోజు ఉదయం నాలుగు గంటలకు లేచి అర్థరాత్రి వరకు తన సినిమాల షూటింగ్ లో అదేవిధంగా రాజకీయాలలో తన కాలాన్ని వృథా కాకుండా సమన్వయం చేసుకుంటున్నాడు. 


ఇలాంటి పరిస్థితులలో పవన్ మరో మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అన్న వార్తలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ కు ఒక సినిమాను చేయబోతున్న పవన్ తనకు అత్యంత సన్నిహితుడు రామ్ తాళ్ళూరికి మరొక సినిమాను చేస్తానని మాట ఇచ్చి దానికి సరైన కథను వ్రాయ వలసిందిగా దర్శకుడు డాలీని కోరినట్లు టాక్. 


ఇది చాలదు అన్నట్లుగా హారికా హాసిని సంస్థకు అదేవిధంగా పూరి జగన్నాథ్ ఛార్మీ లకు 2023 లోపు మరో రెండు సినిమాలు చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. పవన్ ఒప్పుకున్నా ఈ సినిమాలు అన్నీ 2023 లోపు పూర్తి అయ్యే విధంగా యాక్షన్ ప్లాన్ డిజైన్ చేసుకుని ఈ సినిమాలతో తనకు వచ్చే పారితోషికాన్ని 500 కోట్లకు టార్గెట్ గా పెట్టుకుని 2024 ఎన్నికలకు సన్నిద్ధం కావాలని పవన్ యాక్షన్ ప్లాన్ వార్తలు విని అభిమానులు జోష్ లోకి వెళ్ళిపోతుంటే ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్య పోతున్నాయి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: