ఒకప్పటి హీరోయిన్లకు ప్రస్తుత జనరేషన్ హీరోయిన్లకు చాలా తేడా ఉంది. హీరోయిన్ గా సక్సెస్ అయితే క్రేజ్ తో పాటు లాంగ్ కెరీర్ ఉండేది. ప్రస్తుతం వస్తున్న హీరోయిన్లకు సక్సెస్ దక్కడమే కాదు లాంగ్ కెరీర్ అనేది అదృష్టం ఉంటే తప్ప జరగటం లేదు. ఇలాంటి టైమ్ లో టాలీవుడ్ గోల్డెన్ లెగ్ సమంత పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకుంది. ఆమె హీరోయిన్ గా నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’ సినిమా విడుదలై నేటితో పదేళ్లూ పూర్తైంది. ఆమెకిదే తొలి సినిమా కావడంతో సినిమాల్లో పదేళ్ల కెరీర్ పూర్తి చేసుకున్నట్టైంది.

 

 

2010 ఫిబ్రవరి 26న విడుదలైన ఆ సినిమా సూపర్ హిట్. దీంతో టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన సమంత ఇప్పటివరకూ తిరిగి చూసుకోలేదు. తెలుగు, తమిళ్ లో టాప్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులో అయితే నంబర్ వన్ హీరోయిన్ గానూ తన హవా కొనసాగించింది. సమంత కెరీర్లో హిట్లు ఎక్కువ.. ఫ్లాపులు తక్కువ. తన సినిమాల్లో ఫ్లాపుల గురించి వెతుక్కోవాలి తప్ప హిట్ల గురించి ఆలోచించే అవసరం లేదు. అన్ని హిట్లు సమంత ఖాతాలో ఉన్నాయి. ఇది మరే హీరోయిన్ కు దక్కని రికార్డు. అత్తారింటికి దారేది, రంగస్థలం వంటి ఇండస్ట్రీ హిట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఓబేబి సినిమాలో సమంత రెండు పాత్రల్లోనూ పరకాయ ప్రవేశమే చేసింది.

 

 

సాధారణంగా పెళ్లైన హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయి. కానీ సమంత పెళ్లయ్యాకే రంగస్థలం చేసింది. ఇప్పటికీ అవకాశాలు సమంతకు వస్తున్నాయి. తన తొలి సినిమా హీరో నాగచైతన్యనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తెలుగు సినీ పరిశ్రమ గర్వించే అక్కినేని ఇంటి కోడలిగా అడుగుపెట్టింది. కెరీర్లో ఎన్నో అవార్డులు సాధించింది. సమంత మరిన్ని సినిమాల్లో నటించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.   

మరింత సమాచారం తెలుసుకోండి: