క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌లుగా, కమెడియన్‌గా ఇండస్ట్రీల కొనసాగుతున్న చాలా మంది అడపాదడపా హీరోలుగానూ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇప్పుడే కాదు బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలంలోనూ కమెడియన్లు హీరోగా పరిచయంర్య అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలా హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన కమెడియన్‌లు అందరు ఫెయిల్ అయ్యారు. అంతేకాదు వాళ్ల కెరీర్‌ అటు హీరోలుగానూ, ఇటు కమెడియన్లుగానూ కాకుండా మిగిలిపోయింది.


ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన నటుడు సునీల్‌. భీమవరం యాసలో అద్భుతమైన కామెడీ టైమింగ్‌తో అలరించే సునీల్ కెరీర్‌ ఫుల్‌ ఫాంలో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అందాల రాముడు సినిమాతో పరవాలేదనిపించాడు. తరువాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మర్యాద రామన్న సినిమాతో మరో హిట్ అందుకున్నాడు. కానీ తరువాత హీరోగా కెరీర్‌ కొనసాగించలేకపోయాడు. వరుస ఫ్లాప్‌లు సునీల్ కెరీర్‌ను కష్టాల్లో పడేశాయి. దీంతో హీరోగా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. దీంతో చేసేదేమి లేక కమెడియన్‌గా రీఎంట్రీ ఇచ్చినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.


మరో కమెడియన్‌ శ్రీనివాస్ రెడ్డి కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా ఎంట్రీ ఇచ్చి పరవాలేదనిపించాడు. ఆ తరువాత కూడా ఒకటి రెండు సినిమాలు హీరోగా చేసిన సక్సెస్‌ కాలేకపోయాడు. దీంతో అవకాశాలు తగ్గిపోయాయి. అదే సమయంలో కమెడియన్‌గా కూడా అవకాశాలు తగ్గిపోవటంతో ఈ సీనియర్‌ కమెడియన్‌ సినిమాల్లో కనిపించకుండా పోయాడు.

 

సిల్వర్‌ స్క్రీన్‌ కామెడీ సెన్సేషన్‌ సంపూర్ణేష్‌ బాబు కూడా అలా కెరటంలా లేచి పడిపోయాడు. హృదయ కాలేయం లాంటి బ్లాక్‌ బస్టర్‌ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్‌ బాబు హీరోగా కెరీర్‌ను కొనసాగించలేకపోయాడు. సంపూర్ణేష్ బాబు మాత్రమే కాదు సప్తగిరి, షకలక శంకర్‌ లాంటి వారు కూడా హీరోగా ప్రయత్నించి కెరీర్‌ పాడు చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: