ఒకప్పుడు టాప్ డైరెక్టర్ స్టేటస్ అనుభవించిన తేజ పరిస్థితి ప్రస్తుతం చాల నిరాశాజనకంగా ఉంది. అయినప్పటికీ తేజ తన ప్రయత్నాలు కొనసాగిస్తూ కనీసం ఒక్క హిట్ అయినా కొట్టాలని ప్రతి సంవత్సరం తన వంతు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. 


ఆ మధ్య రానా తో తీసిన ‘నేనే రాజు నేనే మంత్రి’ హిట్ అయినా ఆ తరువాత ఈ దర్శకుడు తీసిన సినిమాలు అన్నీ ఫెయిల్ అవుతూ గత సంవత్సరం విడుదలైన ‘సీత’ మూవీ వరకు తేజ ఫ్లాప్ ల అధ్యాయం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితులలో ప్రస్తుతం వరస ఫ్లాప్ లలో కొనసాగుతున్న గోపీ చంద్ తేజా ఇప్పుడు ఒక టీమ్ గా ఏర్పడి ప్రకటించిన మూవీ ‘అలివేలు మంగ వెంకటరమణ’ మూవీ టైటిల్ కు మంచి స్పందన వచ్చింది.


వెంకటరమణ గా గోపీ చంద్ ఫైనల్ అయిన పరిస్థితులలో అలివేలు గా కాజల్ ఉంటుంది అని భావించారు. అయితే తేజ ఆలోచనలు మటుకు వేరుగా ఉండటంతో ఇప్పుడు ఈ మూవీలోని కీలకమైన అలివేలు పాత్ర కోసం తేజ దృష్టిలో కీర్తి సురేశ్ అనుష్క లు ఉన్నట్లు టాక్. గోపీ చంద్ ప్రస్తుత స్థాయితో పోల్చుకుంటే అనుష్క కీర్తి సురేశ్ లు చాల టాప్ రేంజ్ లో ఉన్నా వారు కోరినంత పారితోషికం ఇచ్చి వారిలో ఎవరో ఒకరిని అలివేలు గా మార్చాలని తేజ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్. 


ఇప్పటికే తేజ చెన్నై వెళ్ళి కీర్తి సురేశ్ కు ఈ మూవీ కథను వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కథ విన్న తరువాత ఆమె ఏవిషయం తేల్చకుండా కొంత సమయం కావాలని తేజా ను అడిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె విషయం తేలిన తరువాత అనుష్క వద్దకు ఈ కథ వెళుతుందని ఆమె కూడ కాదంటే ఇక గోపీచంద్ తేజా లకు కాజల్ మాత్రమే పరిష్కార మార్గం అంటూ కామెంట్స్ వస్తున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: