సుమ కనకాల యాంకర్ రంగంలో ఎంతో కాలంగా రాణిస్తూ తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరచుకుంది. తెలుగు రాష్ట్రాలలో ఆమె గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. వయసు పైబడిన సుమ తన వాక్చాతుర్యంతో ఎన్నో సినీ ఈవెంట్లను, టీవీ ప్రోగ్రామ్స్ అవకాశాలను ఇప్పటికీ చేజిక్కించుకుంటుంది. అలాగే తన పాపులారిటీకి తగిన విధంగా ప్రతి ఈవెంట్ షో చేసినందుకుగాను ఆమెకి భారీ పారితోషికం లభిస్తోందని తెలుస్తోంది. కుర్రకారు యాంకర్ అనసూయనే ఒక్క ఈవెంట్ కి రూ.3 లక్షల పారితోషకం అందుకుంటుందంటే... సుమ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటుందో ఊహించుకోవచ్చు.




అలాగే సుమ కనకాల భర్త రాజీవ్ కనకాల కూడా సినిమాల్లో అడపాదడపా నటిస్తూ లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. ఈ విధంగా కోట్ల రూపాయలను సంపాదిస్తున్న దంపతులు తమకంటూ ఒక విలాసవంతమైన ఇల్లు ఉండాలనే ఉద్దేశంతో ఒక ఇంటిని కొనుగోలు చేశారట. ఇంటి రిపేర్ పనులు అన్నీ పూర్తయి.. గృహప్రవేశం చేయాలనుకుంటున్న సమయంలో పెద్ద వారైనా దేవదాసు కనకాల మరణించారు. దీంతో ఒక సంవత్సరం పాటు గృహప్రవేశం చేయరాదని సుమ కనకాల, రాజీవ్ కనకాల ఆగుతున్నారట. ఇంకా ఒక సంవత్సర సమయం ఉంది కాబట్టి... హంగులతో పాటు ఇంటికి పక్క వాస్తు ఉండేలా మెరుగుదిద్దుతున్నారట. అలాగే ఇంటిలోపల సూపర్ డూపర్ లగ్జరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, తమ టేస్ట్ కి తగినట్లు ఇంటీరియర్ డిజైనింగును చేయిస్తున్నారట. అయితే, విలాస పూరితమైన ఈ కొత్త ఇంటి కోసం రూ.20-30 కోట్లు వెచ్చించారని సమాచారం.




ఇకపోతే ఇటీవల సుమ కనకాల రాజీవ్ కనకాల మధ్య చెడిందని వారు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారని వార్తలు వచ్చాయి. కానీ అదంతా అవాస్తవమని వీళ్లిద్దరూ కలిసి కొత్త ఇంటిని కొనుగోలు చేశారని తెలిసిన తర్వాత స్పష్టమైంది. అలాగే సుమ కనకాల తను చేస్తున్న టీవీ ప్రోగ్రాములలో తన భర్తపై కౌంటర్లు వేస్తూనే ఉంది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ కాలేదని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: