తెలుగు లో యాంకర్లు అని చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సుమా కనకాల.  నటుడు రాజీవ్ కనకాల సతీమణి అయిన సుమా కనకాల కేరళా అమ్మాయి అయినా పెరిగింది మాత్రం హైదరాబాద్ లో కావడంతో ఆమె తెలుగు అనర్ఘలంగా మాట్లాడగలుగుతుంది.  ఆమె తెలుగు స్పష్టతపై ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు.  ఒక్కో షోకు లక్షలు కురిపిస్తూ సుమతో యాంకరింగ్ చేయిస్తూ ఉన్నారు. ఇక స్టార్ హీరోల నుండి చిన్న హీరోల సినిమాల వేడుకల వరకు అందరు కూడా సుమ యాంకర్ గా కావాలని కోరుకుంటూ ఉంటారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అందరూ ఇంటివాళ్లు అవుతున్నారు.

 

ఆ మద్య రకూల్ ప్రీత్ సింగ్ హైదరబాద్ లో సొంత ఇల్లు కొన్నది.  ఇటీవల హీరోయిన్ రష్మిక మందన్న కూడా హైదరాబాద్‌లో ఓ కొత్త ఇళ్లు తీసుకున్న సంగతి తెలిసిందే. జబర్ధస్త్ నటులు వరుసగా తమ సొంత ఇల్లు కొనుక్కొని గృహప్రవేశాలు చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ మద్య తీన్మార్ సావిత్రి సైతం తన కొత్త ఇంట్లోకి వెళ్లింది. తాజాగా  ఇప్పుడు సుమ కనకాల దంపతులు కూడా కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా కొన్ని రోజుల క్రితమే ఈ ఇంటి గురించి చర్చలు సాగుతున్నాయి.

 

అయితే గత కొద్ది రోజుల నుంచి ఓ విలాసవంతమైన ఇంటి గురించి ఈ దంపతులు ఎదురుచూస్తున్నారట. దీంతో ఈ కొత్త ఇంటిని అంత్యంత లగ్జరీగా.. పక్కా వాస్తు ప్రకారం మెరుగులు దిద్దుతున్నారట.  స్టార్ హీరోల ఇళ్ల రేంజ్ లో సుమ ఇళ్లు నిర్మాణం ఉందని చూసిన వారు అంటున్నారు.  తాజాగా క్యాష్ షోలో రాజీవ్‌పై సుమ వేసే పంచ్‌లతో  కొత్త ఇంటి వ్యవహారంపై  క్లారిటీ వచ్చేసింది. ఏదేమైనా త్వరలోనే ఈ కొత్త ఇల్లు గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: