బాలీవుడ్‌ హాట్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్‌ చయ్య చయ్య సాంగ్‌తోనే ఫేమస్‌ అయిన సంగతి తెలిసిందే. 1998లో వచ్చిన ఈ పాట ఓ క్లాసిక్‌ హిట్ నిలిచింది. అయితే ప్రస్తుతం అన్ని భాషల్లో రిమిక్స్‌ ట్రెండ్స్‌ నడుస్తున్న నేపథ్యంలో తన సూపర్‌ హిట్ పాటను రిమిక్స్‌ పేరుతో పాడు చేయొద్దని రిక్వెస్ట్ చేస్తోంది మలైకా. 

 

మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన దిల్ సే సినిమాలోని ఈ పాటకు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలందించగా సుఖ్వీందర్‌ సింగ్‌, సప్న ఆస్తీలు ఆలపించారు. బాలీవుడ్ బాద్‌ షా షారూఖ్‌ ఖాన్‌, మలైకా అరోరా ఖాన్‌లపై చిత్రీకరించిన ఈ పాట అప్పట్లో సెన్సేషన్‌ సృష్టించింది. తాజాగా ఈ పాటకు ఓ డ్యాన్స్‌ స్టేజ్‌ మీద ఆడి పాడింది మలైకా.

 

హిందీ డాన్స్‌ రియాలిటీ షో ఇండియాస్ బెస్ట్ డాన్సర్‌ కార్యక్రమంలో పాల్గొన్న మలైకా ఆ పాటకు డ్యాన్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె షూటింగ్ జరిగిన రోజులను గుర్తు చేసుకుంది. ఈ పాటకు ప్రముఖ కొరియోగ్రాఫర్ ఫరాఖాన్‌ డాన్స్‌ కంపోజ్ చేయగా ప్రస్తుతం బెస్ట్ కొరియోగ్రాఫర్‌గా ఉన్న గీత కపూర్ అసిస్టెంట్‌గా పనిచేశారని గుర్తు చేసుకున్నారు.  అయితే ఇదే వేదిక మీద చయ్య చయ్య సాంగ్ రిమిక్స్‌కు సంబంధించిన ప్రస్థావన కూడా వచ్చింది.

 

అయిత రిమిక్స్‌ పాటల విషయంలో తనకు మంచి అభిప్రాయమే ఉన్నా క్లాసిక్స్‌ను రీమేక్‌ చేయటం కరెక్ట్ కాదని ఆ పాటలను అలాగే ఉంచేయాలని ఆమె కోరారు. అంతేకాదు గాడ్‌ ఫాదర్‌, మదర్‌ ఇండియా లాంటి సినిమాల విషయంలో కూడా అలాంటి ప్రయత్నాలు చేయకపోవటమే బెటర్‌ అని ఆమె అభిప్రాయపడ్డారు. మరి మలైకా రిక్వెస్ట్ చేసినట్టుగా చయ్య చయ్య పాటను రిమిక్స్‌ చేయకుండా వదిలిపెడతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: