సినిమా వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా సరే అది ఒక సంచలనంగానే ఉంటుంది. వాళ్ళ గురించి ఏ వార్త వచ్చినా సరే జనం కూడా అదే విధంగా చదువుతూ ఉంటారు. మీడియా కూడా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద అనవసరంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది. టీవీ లు చూడాలి అంటే వెబ్ సైట్ లో వార్తలు చదవాలి అంటే ఈ ప్రచారాలు ఈ వార్తలే చాలా కీలకం. అందుకే వాళ్ళు ఇదే ఫాలో అవుతూ ఉంటారు. హీరోయిన్ల పెళ్లి గురించి జరిగే ప్రచారం అంతా ఇంతా కాదు. 

 

లేని పోనీ వార్తలు అన్నీ రాస్తూ ఉంటారు కొందరు. తాజాగా టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అనుష్క విషయంలో దాదాపుగా ఇదే జరుగుతుంది. ఆమె 40 ఏళ్ళకు దగ్గరవుతున్నారు. దీనితో ఆమె పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. గత నాలుగేళ్ల నుంచి ఆమె పెళ్లి గురించి ఏదోక ప్రచారం జరుగుతూనే ఉంది. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా ప్రభాస్ తో డేటింగ్ చేస్తుంది, క్రికెటర్ తో డేటింగ్ చేస్తుంది అంటూ చాలా వార్తలు ఈ మధ్య వచ్చాయి. అవి ఏవీ నిజం కాదని తెలిసింది. 

 

ఇక ఇప్పుడు తన అభిమాన దర్శకుడికి కోడలు అవుతుంది అనుష్క అంటున్నారు. ఆయన ఎవరో కాదు దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు. ఆయన కుమారుడు తో అనుష్క పెళ్లి ఉంటుంది అనే ప్రచారం జరుగుతుంది. రాఘవేంద్రరావు తనయుడు కేయస్ ప్రకాశ్‌ను అనుష్క పెళ్లి చేసుకుంటుంది అనేది ఇప్పుడు వస్తున్న వార్త. ప్రకాశ్‌కు ఇదివరకే కనిక థిల్లాన్ అనే బాలీవుడ్ రైటర్‌తో పెళ్లి విడాకులు అయ్యాయి. ఇప్పుడు ఆయన్ను రెండో పెళ్లి చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని టాలీవుడ్ జనాలు మాత్రం దీని గురించి ఎక్కువగానే చర్చించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: