టాలీవుడ్ మార్కెట్ ఈ మధ్య బాగా పెరిగింది అనేది వాస్తవం. అగ్ర హీరోలు సినిమాలు అన్నీ కూడా వంద కోట్లకు పైగా వసూళ్లు చేస్తున్నాయ్. చిన్న హీరోల సినిమాలు కూడా అదే విధంగా వెళ్తున్నాయి. 60 నుంచి 80 కోట్ల వరకు వసూళ్లు సాధిస్తున్నాయి. దీనితో నిర్మాతలు కూడా కమర్షియల్ మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఈ మధ్య అదే విధంగా దర్శకులు కూడా కథలు రాస్తున్నారు. సినిమాలో కథ ఉన్నా లేకపోయినా ఓకే బజ్ క్రియేట్ అయితే చాలు సినిమా హిట్ అవుతుంది అనే భావనలో ఉంటున్నారు. 

 

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు కూడా అదే విధంగా ఆలోచిస్తూ వసూళ్ళ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. వసూళ్లు వస్తే సినిమా హిట్ అనే భావనలో ఉండటంతో నిర్మాతలను కూడా అదే విధంగా కోరుతున్నారు. భారీ పారితోషికం కూడా వస్తుంది అలా అయితే అనే భావనలో ఉంటున్నారు మన హీరోలు. అక్కడి వరకు అయితే బాగానే ఉండేది గాని ఇప్పుడు మాత్రం కాస్త సరికొత్తగా ఆలోచించడం మొదలుపెట్టారు. పాన్ ఇండియా వైడ్ గా సినిమా విడుదల అవ్వాలి అంటే సినిమా కమర్షియల్ హంగులతో ఉండాలి. 

 

అలా అవ్వాలి అంటే భారీగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది. అందుకే హీరోలు ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. డిమాండ్ ఉన్న ప్రతీ హీరో అదే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శక నిర్మాతల మీద తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు హీరోలు. హీరోయిన్ కూడా కమర్షియల్ గానే ఉండాలని అంటున్నారు. ఈ పిచ్చి కాస్తా క్రమంగా పెరిగిపోతుంది. దీనితో ఇప్పుడు కథ రాసే రచయితలు కూడా ఇబ్బంది పడుతున్నారు. కథ అలాగే ఉండాలని పరిమితులు పెట్టడంతో రచయితలు ఇబ్బంది పడుతున్నారు. స్వేచ్చగా కథ రాసే వాతావరణం లేకుండా పోయింది. మరి ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: