నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ సినిమా రంగంలో అసిస్టెంట్ డైరెక్ట‌ర్ స్థాయి నుంచి హీరోగా... స్టార్ హీరోగా ఎదిగాడు. నానికి క‌థ‌, క‌థ‌నాలు, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ పై మంచి గ్రిప్ ఎక్కువ‌. అందుకే అత‌డు వ‌రుస హిట్లు కొట్ట‌డం వెన‌క ఓ సీక్రెట్ కూడా ఉంది. మంచి క‌థ‌, క‌థ‌నాలు ఎంచుకుని.. క‌థ‌లో ఏమైనా మార్పులు ఉంటే ముందే డైరెక్ట‌ర్‌తో చ‌ర్చించుకుని ఇబ్బంది లేకుండా నానిసినిమా సెట్స్ మీద‌కు వెళ్లేలా ప‌క్కా ప్లానింగ్‌తో ఉంటాడు. అందుకే నాని ఒక్క సారి హిట్ ట్రాక్‌లోకి వ‌చ్చాక అత‌డి సినిమాలు చాలా త‌క్కువుగా మాత్ర‌మే ప్లాప్ అయ్యాయి. ప్లాప్ అయిన గ్యాంగ్‌లీడ‌ర్ లాంటి సినిమాలు సైతం మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుని.. ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్టైన్ మెంట్ ఇచ్చాయి.



ఇక నాని త‌న అభిరుచి మేర‌కు నిర్మాతగా మారి కూడా మంచి క‌థాంశంతో ఉన్న సినిమాలు తెర‌కెక్కిస్తున్నాడు. ఇటీవ‌ల అ సినిమాతో ఉత్త‌మ నిర్మాత అవార్డు గెలుచుకున్నాడు. ఆ సినిమా క‌మ‌ర్షియ‌ల్ రిజ‌ల్ట్ ఎలా ఉన్నా నానికి నిర్మాత‌గా మంచి పేరు తీసుకు వ‌చ్చింది. అటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు సైతం ఆ సినిమాకు వ‌చ్చాయి. ఇక తాజాగా నాని త‌న శిష్యుడు విశ్వ‌క్‌సేన్‌ను హీరోగా పెట్టి హిట్ సినిమా తీశాడు. ఈ రోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా సైతం మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కింద‌న్న ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి.



ఇక హిట్ సినిమా నాని పెట్టిన పెట్టుబ‌డితో పోల్చితే మంచి లాభాలు కూడా తెస్తుంద‌ని అంటున్నారు. చాలా త‌క్కువ బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన హిట్ యూత్‌తో పాటు కొన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంద‌ని.. ముఖ్యంగా ఏ సెంట‌ర్ల‌తో పాటు మ‌ల్టీ ఫ్లెక్స్‌ల‌లో బాగా ఆడుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ సినిమాకు కెప్టెన్ అయిన శైలేష్ కొల‌ను డిపార్ట్ మెంట్స్ నుంచి బెస్ట్ తీసుకోవడంలో, ఆర్టిస్టుల నుండి బెటర్ పెర్ఫార్మన్స్ తీసుకోవడంలో బాగా స‌క్సెస్ అయ్యాడు. ఏదేమైనా నాని అటు హీరోగానే కాకుండా ఇటు నిర్మాత‌గా కూడా హిట్ కొట్టేస్తున్నాడు. నిన్న అ సినిమా నేడు హిట్ సినిమాతో వ‌రుస హిట్లు త‌న ఖాతాలో వేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: