బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌కి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్లాప్‌ సినిమాతో కూడా ప్రొడ్యూసర్లకు లాభాలు తెచ్చి పెట్టే మాస్ ఫాలోయింగ్ సల్మాన్‌ సొంతం. అందుకే సల్మాన్‌ తో సినిమా చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కడతారు. అలాంటి సల్మాన్‌ ఖాన్ బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్ విషయంలో మాత్రం చాలా కాలంగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. స్వయంగా బీయింగ్ హ్యూమన్‌ కంపెనీని నిర్వహిస్తున్న సల్మాన్‌ వ్యాపార రంగంలో ప్రత్యర్థులను ప్రమోట్ చేయటం ఎందుకన్న ఉద్దేశంతోనే అడ్వార్టైజ్‌మెంట్స్‌కు దూరంగా ఉన్నాడన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.

 

అలా సల్మాన్‌ పూర్తిగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరించను అని చెప్పలేదు. యాపీ ఫిజ్‌, రివైటల్‌, డిక్సీ స్కాట్, భారత్‌ పే, సో మెనీ సిరామిక్స్‌ లాంటి సంస్థలకు ప్రమోటర్‌గా వ్యవహరించాడు. అయితే తాజాగా సల్మాన్‌ వరుసగా బ్రాండ్‌ ఎండార్స్‌మెంట్‌లకు సైన్‌ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. క్రేజ్‌ ఉండగానే దాన్ని క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నాడట సల్మాన్‌. అందుకే తాజాగా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్ మీతో అసోసియేట్ అయ్యాడు.

 

రియల్‌ మీడి తాజాగా రిలీజ్‌ చేస్తున్న రియల్‌ మీ 6, రియల్‌ మీ 6 ప్రొ మోడల్స్‌కు సల్మాన్‌ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికు సల్మాన్‌ స్టిల్స్‌లో రియల్‌ మీ పోస్టర్స్‌ కూడా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ .. ` ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న స్మార్ట్‌ ఫోన్‌ బ్రాండ్‌తో కలిసి పనిచేయటం చాలా ఆనందంగా ఉంది. ఈ బ్రాండ్ వినియోగదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నా` అంటూ ట్వీట్ చేశాడు. సల్మాన్‌కు దాదాపు 3 కోట్ల 90 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారు. అందుకే తమ ప్రాడెక్ట్‌కు సంబంధించి సల్మాన్‌  ఒక్క ట్వీట్ చేస్తే చాలని భావిస్తారు ప్రముఖ బ్రాండ్‌ నిర్వాహకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: