తెలుగులో ఈ మధ్య ఓ హీరో సినిమాలో మరో హీరో కూడా నటించడం జరుగుతోంది. ఆ సినిమాలు మల్టీస్టారర్ కాకపోయినా సినిమాపై క్రేజ్ పెరుగుతోంది. రచయితలు, దర్శకులు ఆ విధంగా కథలు రాయడం మంచి పరిణామం. రీసెంట్ గా బన్నీ సినిమా అల.. వైకుంఠపురములో సినిమాలో మరో హీరో సుశాంత్ కూడా నటించి సినిమా భారీ హిట్ కావడంలో భాగమయ్యాడు. ప్రస్తుతం మరో మెగా హీరో సినిమాలో మరో తెలుగు హీరో కూడా నటిస్తున్నట్టు ఫిలింనగర్ సమాచారం.

 

 

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా బాక్సర్. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో హీరో నవీన్ చంద్ర ముఖ్య పాత్ర పోషిస్తున్నాడని సమాచారం. వరుణ్ కు విలన్ గా ఈ క్యారెక్టర్ ఉంటుందని సమాచారం. నవీన్ కు బాక్సింగ్ స్పోర్ట్ లో అనుభవం ఉందని తెలియడంతో సినిమా యూనిట్ కు కలిసొచ్చిందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో తన పాత్రను నవీన్ కు వివరించినట్టు సమాచారం. అందాల రాక్షసి సినిమాతో హీరోగా పరిచయమైన నవీన్ చంద్ర పలు తెలుగు సినిమాల్లో మంచి పాత్రలు పోషించాడు. 2017లో వచ్చిన నానీ నేను లోకల్, 2018లో వచ్చిన ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత.. వీర రాఘవ, 2019లో వచ్చిన అడవి శేష్ అవును తోపాటు పలు సినిమాల్లో కీలకపాత్రలు పోషించాడు. తమిళ సినిమాల్లో కూడా ఎక్కువగా నటిస్తున్నాడు నవీన్ చంద్ర.

 

 

అల్లు అరవింద్ తనయుడు అల్లు వెంకటేశ్ (బాబి), సిద్ధు ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. బాక్సింగ్ లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ టోని జెఫ్రీస్, ఇండియన్ బాక్సర్ నీరజ్ గోయత్ వద్ద వరుణ్ శిక్షణ కూడా తీసుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ లో బాక్సర్ విడుదలయ్యే అవకాశం ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: