పూరి జగన్నాద్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా తో ఫాం లోకి వచ్చాడు యంగ్ హీరో రామ్. ఆ సినిమాతో చాలా రోజుల తర్వాత మంచి హిట్ కొట్టాడు ఈ స్టార్ యంగ్ హీరో. పాపులారిటి ఉన్నా సరే కొంత మంది దర్శకులు అతనితో సినిమా చేయడానికి కాస్త వెనుకా ముందు ఆడుతూ ఉంటారు. అందుకే రామ్ కూడా కాస్త ఈ మధ్య జాగ్రత్తగా వ్యవహరిస్తూ తన నటనకు భిన్నంగా నటించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇస్మార్ట్ శంకర్ సినిమా రామ్ లో మంచి మార్పులు తీసుకొచ్చింది అంటారు కొందరు టాలీవుడ్ జనాలు. 

 

ఇక అది పక్కన పెడితే ఇప్పుడు కిషోర్ తిరుమల దర్శకత్వంలో రెడ్ అనే టైటిల్ తో కాస్త భిన్నంగా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ద్వారా రామ్ రెండు రకాలుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తనలో ఉన్న హైపర్ యాక్షన్ ని పక్కన పెట్టి ఈ సినిమా కోసం పని చెయ్యాలని చూస్తున్నాడు ఈ ప్రకాశం జిల్లా హీరో. ఇందుకోసం తనలో తాను ఎన్నో మార్పులు కూడా చేసుకున్నాడు. ఇప్పటికే రామ్ ఈ సినిమాలో ఎలా ఉండబోతున్నాడో మాస్ తో పాటు క్లాస్ ని ఆకట్టుకునే విధంగా ఒక లుక్ బయటకు వచ్చింది. 

 

అది అలా ఉంటే ఈ సినిమా టీజర్ ఇప్పుడు బయటకు వచ్చింది. శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన ఈ టీజర్ లో రామ్ కాస్త కొత్తగా ఉన్నాడు. ఒక కేసు ఆధారంగా సినిమా ఉండే అవకాశం ఉందని టీజర్ చూడగానే స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా రామ్ ఒక అధికారిగా నటించే అవకాశం ఉంది అనేది ఈ సినిమా టీజర్ స్పష్టంగా చెప్తుంది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ టీజర్ కి హైలెట్ గా చెప్పుకోవచ్చు ఈ సినిమాలో రామ్ సరసన నివేతా పేతురాజ్, మాళవిక శర్మ నటిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: