నేచురల్ స్టార్ నానీ ఈ మధ్య హీరోగానే కాదు నిర్మాతగా కూడా సక్సెస్ అవుతున్నాడు. వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అలాగే మంచి కథ దొరికితే నిర్మాతగా కూడా పని చెయ్యాలని భావిస్తున్నాడు. నానీ నిర్మాతగా వచ్చిన హిట్ సినిమా మంచి విజయం సాధించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. దీనితో నిర్మాతగా నానీకి మరో సక్సెస్ దక్కింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం నానీ టక్ జగదీష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఈ సినిమా లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 

 

ఆ లుక్ సినిమాపై అంచనాలను కూడా భారీగా పెంచింది అనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి అవుతుంది. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలని భావిస్తున్నాడు నానీ. ప్రస్తుతం ఈ సినిమాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. త్వరలోనే కొన్ని పాటలను కూడా విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమా కథ గురించి అన్నమాట. అది ఏంటో ఒక్కసారి చూద్దాం. 

 

యంగ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌ లో వస్తున్న ఈ చిత్రం గతంలో వచ్చిన ఓ క్లాసిక్ సినిమా స్ఫూర్తిగా ఈ చిత్రం తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. తమిళ ప్రముఖ అగ్ర దర్శకుడు మణిరత్నం గతంలో రూపొందించిన `అగ్ని నచ్ఛత్రం` (తెలుగులో `ఘర్షణ`) ప్రభావం, ఆ సినిమాలో ఉండే కొన్ని సీన్స్ `టక్ జగదీష్`లో ఉంటాయని సోషల్ మీడియా అంటుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఆ సినిమా తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా సినిమా నటులు కంటే ఆ కథకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: