సినీ నటుడు యాంకర్ సాయి కుమార్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయనే కాదు.. ఆయన సోదరులు కూడా సినీరంగంలో తమకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. వీరంతా తెలుగులో ఎంత ఫేమసో కన్నడంలో కూడా అంతగా పేరు తెచ్చుకున్నారు. ఇక సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ శర్మ కూడా డబ్బింగ్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నారు. ఆయన అరుంధతి సినిమాలో పశుపతి పాత్రకు చెప్పిన డబ్బింగ్ ఇప్పటికీ హైలెట్ గా చెప్పుకోవచ్చు.

 

 

అలాంటి రవిశంకర్ శర్మను ఇటీవల సినీనటుడు, యాంకర్ అలీ ఇంటర్వ్యూ చేశారు. ఆ కార్యక్రమంలో రవిశంకర్ శర్మ అనేక విషయాలు అలీతో పంచుకున్నారు. ఆ సమయంలో రవిశంకర్ శర్మ తన ఫ్యామలీ గురించి మనసు విప్పి మాట్లాడారు. తన తల్లి గురించి చెబుతూ ఆమె ఎప్పుడూ చెప్పే మాటలను గుర్తు చేసుకున్నారు. నీ పుట్టుక అనేది సాధారణంగా ఉన్నా.. నీ మరణం మాత్రం గొప్పగా ఉండాలి అని రవిశంకర్ శర్మ వాళ్ల అమ్మ ఎప్పుడూ చెబుతూ ఉండేవారట.

 

 

అంటే మనం సాధారణ వ్యక్తిగా పుట్టిన అసాధారణ వ్యక్తిగా ఎదగాలన్నది ఆమె ఆకాంక్ష.. ఈ విషయాన్ని చెప్పేటప్పుడు రవిశంకర్ శర్మ కళ్లలో నీళ్లు తిరిగాయి. అంతే.. యాంకర్ అలీ కూడా ఒక్కసారిగా మౌనంగా మారిపోయారు. అమ్మ ప్రస్తావన రాగానే ఆయన కళ్లు వర్షించడం మొదలు పెట్టాయి. ఎందుకంటే ఇటీవలే ఆలీ కూడా అమ్మను కోల్పోయారు.. బహుశా ఆయనకు తన తల్లి గుర్తొచ్చిఉండొచ్చి. తన కోసం ఆమె ఎంతగా కష్టపడిందో గుర్తొచ్చిఉండొచ్చు.. నిజంగా ఈ సన్నివేశం ప్రేక్షకులను కూడా కంటతడి పెట్టించడం ఖాయం.

 

 

ఎందుకంటే అమ్మ ఎవరికైనా అమ్మే కదా. మన శ్రేయస్సు కోరుకునే వారిలో ముందుడేది మన అమ్మే కదా. మనం ఎదిగితే మనకంటే ఎక్కువగా సంతోషపడేది మన అమ్మే కదా. అందుకేనేమో బహుశా అమ్మ ప్రస్తావన రాగానే ఆలీ చిన్న పిల్లాడిలా ఏడ్చేశారు. ఆయన కళ్లవెంట కన్నీరు ధార కట్టింది. అది కన్నీరు కానే కాదు..తన తల్లికి ఆలీ సమర్పించిన అశ్రు నివాళి. ఇది అలీ మాతృమూర్తి కే కాదు.. ప్రపంచంలో బిడ్డల కోసం త్యాగాలు చేసిన అమ్మలందరికీ నిజమైన అభినందన.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: