ఇండియన్‌ సూపర్‌ హీరో గా పేరు తెచ్చుకున్న బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌. తొలి సినిమా కహోనా ప్యార్‌ హై తోనే సంచలనం సృష్టించిన హృతిక్‌ తరువాత క్రిష్‌, ధూమ్‌ 2 లాంటి సినిమాలతో సూపర్‌ స్టార్ గా ఎదిగాడు. ఇండియన్‌ స్క్రీన్‌ మీద డ్యాన్స్‌, యాక్షన్‌కు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిన హృతిక్‌ త్వరలో హాలీవుడ్‌ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అందుకే గట్టి ప్లానే వేశాడు ఈ టాప్‌ హీరో. ఓ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.

 

అమెరికాకు చెందిన గ్రెష్‌ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడు హృతిక్‌. ఈ సంస్థ హృతిక్‌ తో పాటు సెలబ్రిటీ మేనేజ్‌ మెంట్ సంస్థ క్వాన్‌, హృతిక్‌ మేనేజర్‌ అమృత సేన్‌లతో సంప్రందింపులు జరపనుంది. హృతిక్‌ ఎప్పటికప్పుడు హిందీ సినిమాను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. గత 20 ఏళ్లలో బాలీవుడ్‌ కు ఎన్నో కొత్త విషయాలు, కొత్త జానర్‌లను పరిచయం చేశాడు. తాజాగా ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేయగలిగిన కంటెంట్ మీద దృష్టి పెట్టాడు.

 

ఈ సందర్భంగా హృతిక్ మేనేజర్ అమృత మాట్లాడుతూ.. `ఇండియాను సినిమా రంగంలోనూ గ్లోబలైజేషన్‌ దిశగా మరింత ముందుకు తీసుకెళ్లాలన్నదే మా ఆశయం. ఇంత వరకు ఇక్కడి ఫిలిం మేకర్స్‌ క్యాప్చర్‌ చేయలేని చాలా మార్కెట్‌ లను వారికి అందజేయలన్న సంకల్పంతో హృతిక్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రెష్‌ సంస్థ హృతిక్‌ ఆలోచను ప్రపంచ వ్యాప్తం చేస్తోంది. ఈ సంస్థ హృతిక్‌ ఇండియాలో నటించిన సినిమాలను హాలీవుడ్‌కు పరిచయం చేయనుంది`.

 

హృతిక్‌ రోషన్‌ కెరీర్ విషయానికి వస్తే ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు రాకేష్‌ రోషన్‌ వారసుడిగా వెండితెరకు పరిచయం అయ్యాడు హృతిక్‌ రోషన్‌, 2000లొ వెండితెరకు పరిచయం అయిన హృతిక్‌.. కాహోనా ప్యార్‌హై నుంచి వార్‌ వరకు ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించాడు. నటుడిగానే కాదు కమర్షియల్‌ స్టార్‌గానూ ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు హృతిక్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: