ప్రస్తుతం అక్షయ్‌ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న సూర్యవంశీ సినిమాలో నటిస్తున్న  బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌, తన డైట్‌ ప్లాన్‌, వర్క్‌ అవుట్‌ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 36 ఏళ్ల వయసులోనూ ఈ భామ ఫిట్‌ నెస్‌ ఐకాన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న కత్రినా ఆ క్రెడిట్ సాధించేందుకు ఎంతో కష్టపడుతోంది. తానే స్వయంగా ఓ ఫిట్ నెస్‌ ప్లాన్‌ను రెడీ చేసుకొని మరి ప్రాక్టీస్‌ చేస్తోంది.

 

తన ఫిట్‌ నెస్‌ గోల్స్‌ గురించి మాట్లాడిన కత్రినా.. `నేను ఫిట్‌ నెస్‌కు చాలా ఇంపార్టెన్స్‌ ఇస్తాను. ప్రతీ రోజు తప్పుకుండా గంట నుంచి మూడు గంటల వరకు వర్క్‌ అవుట్ చేస్తాను. వర్క్‌ అవుట్ విషయంలో గతంలో నేను క్రియేట్ చేసిన రికార్డ్ ను నేనే ఛాలెంజ్‌ చేస్తాను. సొంతంగా నేనే ఒక వర్క్ అవుట్ ప్లాన్ సెట్ చేసుకుంటాను అందులో స్క్వాట్స్‌, ఫుష్‌ అప్స్‌ లాంటివి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. అంతేకాదు పిలెట్స్‌, యెగా లాంటివి కూడా చేస్తాను. వెయిట్ ట్రైనింగ్‌, ఫంక్షనల్‌ ట్రైనింగ్‌ లాంటివి కూడా చేస్తాను.

 

ఫుడ్‌ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటాను. తప్పకుండా గ్లుటెన్‌, రిఫైన్డ్ షుగర్‌, డైరీ ప్రాడక్ట్స్‌ లాంటి వాటి జోలికి అస్సలు వెళ్లను. రోజు ఉదయాన్నే నాలుగు గ్లాసుల గోరు వెచ్చని నీరు తాగుతా, ఉడకబెట్టిన కూరగాయలతో పాటు ప్రతీ రెండు గంటలకు ఒకసారి ఫ్రూట్స్‌ తీసుకుంటా. వీటితో పాటు ధాన్యాలు, ఓట్స్‌ ను బ్రేక్‌ ఫాస్ట్ లో తీసుకుంటా. గ్రిల్డ్‌ ఫిష్‌, చిక్కుళ్లు, సలాడ్స్‌ లాంటివి లంచ్‌ లో తీసుకుంటా. పీనట్‌ బటర్‌తో బ్రెడ్‌ స్నాక్స్‌ లో, ఫిష్‌, సూప్‌, సలాడ్ డిన్నర్‌లో తీసుకుంటా. ఇలా స్ట్రిక్ట్ డైట్ మెయిన్‌టైన్‌ చేస్తున్న కారణంగానే ఇలా ఫిట్‌ గా ఉండగలుగుతున్నా` అంటూ  చెప్పుకొచ్చింది కత్రినా. ప్రస్తుతం కత్రినా నటిస్తున్న సూర్య వంశీ మార్చ్‌ లో రిలీజ్‌ కు రెడీ అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: