పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమా రంగంలోకి తిరిగి అడుగుపెట్టారు.  వరసగా సినిమాలు చేస్తూ మరోవైపు పార్టీ పనులు చూసుకుంటూ తీరికలేకుండా గడుపుతున్నాడు.  తనకు వచ్చే ఆదాయమార్గం ఇదొక్కటే కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.  సినిమాల్లో వచ్చే డబ్బును రాజకీయాల్లో ఖర్చు పెడుతున్నారు.  లేదంటే రాజకీయాలు చేయడం చాలా కష్టం.  అందుకే పవన్ ఇలా చేస్తున్నారు.  


ఇక ఇదిలా ఉంటె, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన 26,27 సినిమాలు చేస్తున్నారు.  26 వ సినిమా పింక్ రీమేక్.  దీనికి 30 రోజుల కాల్షీట్ ఇచ్చారు.  సినిమాను వేగంగా పూర్తి చేస్తున్నారు.  అంతేకాదు, ఈ మూవీ సమ్మర్ కు రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి.  ఈ సినిమాతో పాటుగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ సినిమా కూడా షూటింగ్ చేస్తున్నారు.  


సినిమా ఔరంగజేబు కాలం నాటికి సంబంధించిన కథ కావడంతో షూటింగ్ నిదానంగా జరుగుతున్నది.  కానీ, ఆ సినిమాకు భారీ డిమాండ్ ఉన్నది.  పెరియాడికల్ సినిమాలో పవన్ ఎలా ఉంటారు అన్నది ఇప్పుడు ఆసక్తికరం.  ఈ సంవత్సరం చివరి వరకు సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్ కు రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది.  ఇక ఇదిలా ఉంటె, పవన్ 28 వ సినిమా కూడా లైన్లోకి వచ్చినట్టుగా సమాచారం.  


ఈ మూవీని తన మిత్రుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించే ఛాన్స్ ఉంటుంది.  అయితే, 29 ఎవరితో అన్నది తెలియలేదు కానీ, పవన్ 30 వ సినిమా మాత్రం ఓ భారీ దర్శకుడితో చేయబోతున్నారని ప్రచారం జరుగుతున్నది.  అయన ఎవరో కాదు.  రాజమౌళి.  రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఉంటుందని, పవన్ కళ్యాణ్ కు తగిన సబ్జెట్ తో రాజమౌళి సినిమా చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.  ఆ సినిమా చేసే సమయంలో పవన్ కొంత ఎక్కువ సమయం రాజమౌళి సినిమా కోసం కేటాయిస్తారని, ఆ తరువాత ఎన్నికల కోసం మిగతా సమయం కేటాయిస్తారని సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: