తెలుగు బుల్లితెరపై వచ్చే పటాస్ ప్రోగ్రామ్ లో రచ్చ రాములమ్మ అంటే ప్రతి ఒక్కరికీ గుర్తు ఉంటుంది.. యాంకర్ శ్రీముఖి ‘పటాస్’ లో రచ్చ రాములమ్మగా చేసే హంగామా ఓ రేంజ్ లో ఉండేది. యాంకర్ రవితో కలిసి శ్రీముఖి అప్పట్లో కాస్త అతిగానే ప్రవర్తించేదని విమర్శలు కూడా వచ్చాయి. ఒకనోక సందర్భంలో స్టేజ్ పైనే శ్రీముఖిని రవి ముద్దు కూడా పెట్టుకున్నాడు. అయితే ఇదంతా కేవలం ప్రోగ్రామ్ ఎంట్రటైన్ మెంట్ చేయడానికే అని క్లారిటీ ఇచ్చారు. ఆ మద్య రవి-శ్రీముఖి మద్య అదేదో ఉందని తెగ ప్రచారాలు జరిగాయి. కానీ తమది కేవలం స్నేహం మాత్రమే అని వీరిద్దరూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పటాస్2 నడుస్తుంది.. ఈ కార్యక్రమంలో ఇద్దరూ కనిపించడం లేదు. అయితే ఆ మద్య బిగ్ బాస్ 3 లో శ్రీముఖి చేసిన హడావుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ 3 ఇటీవల నాగార్జున హూస్ట్ చేశారు. మొదటి నుంచి బిగ్ బాస్ లో అందరిగో కలుపుగోలుగా ఉంటూ వచ్చిన శ్రీముఖి చివరి వరకు పోటీలో నిల్చుంది. అయితే చివర్లో మాత్రం ఆడియన్స్ సింగర్ రాహూల్ సిప్లిగంజ్ అత్యాధిక ఓట్లు సాధించి బిగ్ బాస్ 3 విన్నర్ గా నిలిచాడు. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రీముఖి ఇండస్ట్రీవైపు వెళ్తుందని బావించారు. కానీ అలా జరగలేదు.. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై నటిస్తుంది. తాజాగా తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటూ కొన్ని సోషల్ మీడియాల్లో వస్తున్న వార్తలపై చాలా ఘాటుగా.. సెటైర్ గా స్పందించింది శ్రీముఖి. తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని, లవ్‌లో ఉందని వస్తోన్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది.
'భూత, వర్తమాన కాలాలకు చాలా తేడా ఉంటుంది. గతంలో లవ్‌లో ఉన్నాను.. ఇప్పుడు లవ్‌లో ఉన్నాను అనే వ్యాఖ్యలకు చాలా తేడా ఉన్నాయి. ఆ మద్య ఇన్‌స్టాగ్రామ్‌లో చిన్న వీడియో చేసిన పాపానికి తనపై కంటిన్యూగా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా.. లవ్ లో ఉన్న శ్రీముఖి అంటూ తెగ వార్తలు వస్తున్నాయని అన్నారు. నిజాలు తెలుసుకుని, ఇంగ్లిష్ నేర్చుకుని రాస్తే మీకే మంచిది. మ్యాటర్ బాగా కనుక్కుని రాస్తే బాగుంటుంది. షూటింగ్లో బిజీగా ఉంటున్నాను. నా పర్సనల్ లైఫ్ గురించి నా కంటే మీకే బాగా తెలుసు. నేను లవ్ లో పడితే ఫస్ట్ మీకే చెబుతా అంటూ సెటైర్ వేసింది.