టాలీవుడ్ లో ఇప్పుడు రష్మిక మందన్నా, పూజ హెగ్డే ట్రెండ్ నడుస్తుంది. వాళ్ళు అడిగినంత ఇవ్వడానికి దర్శక నిర్మాతలు సిద్దమవుతున్నారు. మరో హీరోయిన్ వీళ్ళకు ప్రత్యామ్నాయం లేకపోవడం స్టార్ హీరోల పక్కన వరుస హిట్ లు కొట్టడంతో వీళ్ళకు ఇప్పుడు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ ఏడాది మంచి ఆరంభం లభించింది ఈ ఇద్దరికీ. దీనితో రేటు కూడా భారీగానే పెంచేస్తున్నారు ఈ ఇద్దరు. వచ్చే ఏడాది వరకు వీళ్ళ చేతిలో ఫుల్ గా సినిమాలు ఉన్నాయి. దీనితో ఇప్పుడు బాలీవుడ్ వైపు కూడా చూస్తున్నారు.

 

తమిళ సినీ పరిశ్రమ కూడా వీళ్ళకు అవకాశాలు ఇవ్వడానికి సిద్దమవుతుంది. ఒక స్టార్ హీరో సినిమాకు వీళ్ళు ఇద్దరిలో ఎవరిని తీసుకోవాలి అనే దానిపై ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. స్టార్ దర్శకులు కూడా వీళ్ళతో సినిమాలు చేయడానికి తమిళంలో పోటీ పడుతున్నారట. పూజ కు విజయ్ పక్కన అవకాశం వచ్చింది అంటున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఆమెను తీసుకునే అవకాశం ఉందని టాక్ వినపడుతుంది. త్వరలో దీనిపై స్పష్టత వస్తుంది. 

 

ఇది పక్కన పెడితే ఈ ఏడాది రెండు హిట్స్ తో మంచి ఊపు మీదున్న రష్మిక మందన్నా భారీగా డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు ఆమె అడుగుతుంది అంటున్నారు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఉన్న అవకాశాన్ని వదులుకోవద్దని భావిస్తుంది ఈ అమ్మాయి. దీనితో ఇప్పుడు టాలీవుడ్ జనాలు కూడా ఆమెకు అవకాశాలు ఇవ్వడానికి ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. వచ్చిన అవకాశాలను వదులుకోవద్దు అంటూనే డిమాండ్లు కూడా చేయడంతో నిర్మాతలు భయపడుతున్నారని టాలీవుడ్ అంటుంది. ప్రస్తుతం ఈమె సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమాకు సైన్ చేసింది. ఆ సినిమా త్వరలో సెట్స్ మీదకు వెళ్ళే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: