సిని పరిశ్రమ మీద ఎందరికో ప్రేమ ఉంటుంది. ఎందరో అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకుని ఫిలిం నగర్ లో కృష్ణా నగర్ లో ఎక్కువగా అవకాశాల కోసం పడిగాపులు పడుతూ ఉంటారు. ఒక్కసారి అయినా యాక్షన్ అంటూ నటించలేమా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అందం ఉంటుంది, నటన ఉంటుంది. అన్నీ ఉంటాయి కాని అవకాశాలు మాత్రం కొందరికే వరిస్తాయి. ఆ అవకాశాలు కూడా కొందరికి నచ్చిన వాళ్ళకే అందుతూ ఉంటాయి. నిర్మాతలు కూడా దాదాపుగా ఇంతే. 

 

సినిమా మీద పెట్టుబడి పెట్టడానికి చాలా మంది ఎక్కువగా ఆసలు పెట్టుకుంటారు. కాని అది మాత్రం చాలా మందికి కలగానే మిగిలిపోతుంది. ఒక నాలుగు కుటుంబాలు మాత్రమే ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమను యేలుతున్నాయి అనే విమర్శలు వస్తున్నాయి. గతంలో చిన్న సినిమాల విషయంలో పెద్ద నిర్మాతలు వేలు పెట్టే వాళ్ళు కాదు. కాని ఇప్పుడు అగ్ర నిర్మాతలు చిన్న సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. దీనితో ఇప్పుడు అవకాశాల కోసం నిర్మాతలు కూడా ఎదురు చూసే పరిస్థితి ఎక్కువగా ఏర్పడింది అనే మాట అక్షరాలా నిజం. 

 

చిన్న సినిమా కథ బాగుంటే చాలు దర్శకులు కూడా అగ్ర నిర్మాతల వద్దకు వెళ్లి కథ వినిపిస్తున్నారు. ముఖ్యంగా ఆ నాలుగు కుటుంబాల దగ్గరకే కథలు అన్నీ వెళ్తున్నాయి. ముఖ్యంగా మూడు కుటుంబాలు నిర్మాణ పరంగా కూడా టాలీవుడ్ ని ఎక్కువగా శాసిస్తున్నాయి అనేది వాస్తవం. దీనితో చాలా మంది నిర్మాతలు ఇప్పుడు సినిమాకు దండం పెట్టేస్తున్నారు. మాకు సినిమా వద్దు బాబోయ్ అనే పరిస్థితి టాలీవుడ్ లో ఏర్పడింది అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు, థియేటర్ నుంచి సినిమా టికెట్ ల వరకు అన్నీ వాళ్ళ పెత్తనమే నడుస్తుంది ఇప్పుడు.

మరింత సమాచారం తెలుసుకోండి: