ఇటీవల మహిళ మీద జరుగుతున్న దారుణాలు మరింత పెరుగుతున్నాయి. అయితే ఈ అఘాయిత్యాల విషయంలో ఒకొక్కరూ ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది వీటి కారణం అబ్బాయిలు పెరుగుతున్న వాతావరణం అంటుంటే మరికొందరు మాత్రం అమ్మాయిలు, వారి వస్త్రదారణ కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయన్న వాదన కూడా వినిపిస్తున్నారు. ఇలాంటి విమర్శలపై స్వతంత్ర్య భావాలున్న మహిళలు కూడా ఘాటుగానే స్పందిస్తున్నారు. తాజాగా నటి రాధికా మదన్‌ కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.


బుల్లితెర నుంచి వెండితెర మీదకు అడుగు పెట్టిన అందాల భామ రాధికా మదన్‌ ఆమె ఇన్నర్‌ వేర్‌కు సంబంధించిన  ఓ కార్యక్రమానికి మద్ధతుగా క్యాంపెయిన్ చేస్తోంది. ఇంటర్‌నేషనల్‌ ఉమెన్స్‌ డే రాబోతున్న సందర్భంగా ఈ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాధికా మదన్ మీడియాతో మాట్లాడింది. `మనం 2020లో ఉన్నాం. ప్రతీ విషయంలో మహిళలు ప్రశంసలు అందుకుంటున్నారు. కానీ ఏ మహిళలనైతే పొడుగుతున్నారో అదే మహిళ ఇన్నర్‌ వేర్‌ బయటికి కనిపించేలా వేసుకుంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. మహిళలు వేసుకునే దుస్తులను బట్టి వారి క్యారెక్టర్‌ని డిసైడ్ చేసే రోజుల పోయాయి. వాళ్లు ఎలాంటి దుస్తుల్లో కంఫర్టబుల్‌ గా ఫీలవుతారో అలాంటి డ్రెస్‌ వేసుకోనివ్వాలి.


నేను స్కూల్లో చదువుతున్నప్పుడు ఓ కుర్రాడు నా దగ్గరికి వచ్చి నీ లోదుస్తులు కనిపిస్తున్నాయి అని చెప్పాడు. అప్పుడు నేను ఏదో తప్పు చేసిన దానిలా సిగ్గుతో ఇంటికి వెళ్లిపోయాను. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి కనిపిస్తే నీ పని నువ్వు చూసుకోరా అని చెప్పాలని ఉంది. నేను అందరు ఆడపిల్లలకు ఒక్కటే చెప్పాలని అనుకుంటున్నాను. మీ లోదుస్తులు బయటపడితే వాటిని చూసి సిగ్గుపడకండి. అది కేవలం మీ శరీరాన్ని కాపాడుకోవడానికి వేసుకునే డ్రెస్‌ మాత్రమే.. మీ వ్యక్తిత్వాన్ని డిసైడ్‌ చేసేవి కావు` అంటూ కామెంట్‌ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: