అవకాశాలు రావడం అనేది సినీ పరిశ్రమలో చాలా అవసరం. సినిమా పరిశ్రమలో నిలబడాలి అంటే అవకాశాలు రావాలి వాటితో పాటుగా సరైన హిట్ లు కూడా అవసరం. ఈ మధ్య చాలా మంది నటులు అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నారు గాని సరైన హిట్ మాత్రం కొట్టలేకపోతున్నారు. సరైన హిట్ కొట్టిన వాళ్ళు కూడా నిలబడటం అనేది చాలా కష్టంగా మారింది ఈ రోజుల్లో. అవకాశాల కోసం కలలు కంటూ కాళ్ళు అరిగే విధంగా తిరుగుతూ ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. 

 

అయినా సరే చాలా మందికి అవకాశం రావడం లేదు. ఇక హీరోయిన్స్ పరిస్థితి ఈ మధ్య మరీ దారుణంగా ఉందీ అనేది పలువురి మాట. ప్రేక్షకుల ఆలోచనా విధానం మారుతున్న నేపధ్యంలో దర్శక నిర్మాతలు కూడా హీరోయిన్ అనగానే స్కిన్ షో చెయ్యాలి అనే నిబంధన ఎక్కువగా పెడుతున్నారు. దీనితో ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఒప్పుకున్నా వాళ్ళు సినీ పరిశ్రమలో ఉంటున్నారు ఒప్పుకోని వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఏర్పడింది. కీర్తి సురేష్ లాంటి యాక్టర్ ని ఇందుకే ఇబ్బంది పెట్టారు తెలుగులో. అందుకే ఆమె తెలుగులో సినిమా చెయ్యాలి అంటే భయపడుతుంది. 

 

అనుపమా పరమేశ్వరన్, సాయి పల్లవి లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు టాలీవుడ్ లో ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చూపిస్తేనే అవకాశాలు ఇస్తామని కొందరు దర్శకులు నిర్మాతలు మొహం మీదే చెప్పడం వాళ్లకు ఇబ్బందికరంగా మారింది అనే చెప్పుకోవచ్చు. ప్రతిభ ఉన్న ఎందరో హీరోయిన్లు ఇలా అవకాశాలు రాక ఆత్మాభిమానం చంపుకోలేక ఇబ్బంది పడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా వారు పోస్ట్ చేసే ఫోటోలు చూస్తే కొన్ని కొన్ని సార్లు బాధ అనిపించే పరిస్థితి ఏర్పడింది అనేది నిజం. మరీ కొందరు హీరోయిన్లు చేస్తున్న స్కిన్ షో చూసి పలువురు కన్నీరు పెట్టుకునే పరిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: