టాలీవుడ్ హీరోలు నిన్న మొన్న‌టి వ‌ర‌కు తెలుగు మార్కెట్ మీదే కాన్‌సంట్రేష‌న్ చేస్తూ సినిమాలు చేస్తూ వ‌చ్చేవారు. అయితే ఇప్పుడిప్పుడే మ‌న హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోలుగా మారిపోతున్నారు.  ఈ లిస్టులో ముందు వ‌రుస‌లో ఉన్న హీరో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌. బాహుబ‌లి 1, 2 సినిమాల‌తో పాటు సాహో సినిమా దెబ్బ‌తో ప్ర‌భాస్ ఒక్క సారిగా క్రేజీ స్టార్ గా మారిపోయాడు. ఇప్పుడు ప్రభాస్‌తో సినిమా అంటే రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల్సిన ప‌రిస్థితి.

ఇక అల్లు అర్జున్ సైతం తెలుగు మార్కెట్‌తో పాటు అటు హిందీ మార్కెట్‌, కేర‌ళ మార్కెట్ కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నాడు. ఇక ఇప్పుడు చెర్రీ కూడా ఈ లిస్టులో చేర‌గా.. ఇప్పుడు టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ సైతం ఆర్.ఆర్.ఆర్ సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ కాన్‌సంట్రేష‌న్ చేస్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఎన్టీఆర్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి బడా మల్టీస్టారర్ లో రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో ఎక్కువ అడుగుతాడ‌న్న రూమ‌ర్‌, వార్త‌లు బ‌య‌ట‌కు పొక్క‌లేదు.

తెలుగులో పారితోష‌కాల విష‌యంలో ఎక్కువ ర‌చ్చ జ‌రిగేది మహేష్, పవన్ కళ్యాణ్, రామ్‌చ‌ర‌ణ్‌, ప్ర‌భాస్‌, బ‌న్నీల గురించే. ఈ విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ పేరు పెద్ద‌గా బ‌య‌ట‌కు రాలేదు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పేరు సైతం ప్ర‌ముఖంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఇప్ప‌టికే ఐదు వరుస హిట్ల‌తో దూసుకు పోతోన్న ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ కూడా సూప‌ర్ క్రేజీ కాంబోలో వ‌స్తుండంతో.. ఆ త‌ర్వాత చేసే సినిమాల‌కు రు. 50 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ని అంటున్నారు.

ఇప్పటివరకు 20 నుండి 25 కోట్ల పారితోషకంతో సరిపెట్టుకున్న ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ రేంజ్‌ను బ‌ట్టి త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేస్తాడ‌ని.. ప్ర‌భాస్ రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసినా ఆశ్చ‌ర్య‌పడాల్సిన అవ‌స‌రం లేదంటున్నారు. మ‌రి ఫైన‌ల్‌గా ఎన్టీఆర్ ఎలాంటి డెసిష‌న్ తీసుకుంటారో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: