టాలీవుడ్ లో ఉన్నంత మంది కమెడియన్లు భారతదేశ సినీ పరిశ్రమలో మరెక్కడా లేరన్నది వాస్తవం. ఎందరో కమెడియన్లు తెలుగు సినీ ప్రేక్షకుల్ని నవ్వించారు.. నవ్విస్తూనే ఉన్నారు. తమదైన శైలిలో హాస్యాన్ని పండిస్తూ వెండితెరపై రాణిస్తున్నారు. వారిలో చిన్న వయసు నుంచీ నటిస్తూ, తదనంతర కాలంలో స్టార్ కమెడియన్ గా ఎదిగిన వ్యక్తి ఆలీ. హాస్యాన్నే నమ్ముకున్న ఆయన వెండితెర ప్రస్థానం ఇప్పటికీ వెలుగులీనుతూనే ఉంది. కానీ ఆలీ హాస్యనట చక్రవర్తిగా మారడానికి ముందు అనేక కష్టాలను ఎదుర్కొన్నారు.

 

 

రాజమండ్రికి చెందిన ఆలీ తండ్రి ఓ టైలర్. షోలే సినిమాలోని గబ్బర్ సింగ్ పాత్ర చెప్పే డైలాగులను అలవోకగా చెప్పడం చూసి ఆలీని సినిమాల్లోకి తీసుకున్నారు. నిండు నూరేళ్లు సినిమా ద్వారా పరిచయమైన ఆలీ అక్కడి నుంచి చైన్నైలోని భారతీరాజా వద్దకు తీసుకెళ్లారు. నువ్వేం చేస్తావు అని అడిగితే.. మీకేం కావాలో చెప్పండి అన్నాడట భారతీరాజాతో ఆ చిన్నారి ఆలీ. దాంతో నీకొచ్చింది చేయమంటే గబ్బర్ సింగ్ డైలాగులను అలవోకగా చెప్పేశాడట. దీంతో సీతాకోకచిలుక సినిమాలో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయింది. అప్పటి నుంచి ఆలీ రాజమండ్రిలోని తల్లిదండ్రులకు దూరంగానే అంత చిన్నవయసులో పెరిగాడు. ఒక్కోసారి సినిమాలో నటించటం కోసం రాజమండ్రి నుంచి చెన్నై వరకూ ఒంటరిగానే వెళ్లేవాడట.

 

 

అక్కడ షూటింగుల్లోనే బస చేస్తూ చిన్న వయుసులోనే సంపాదిస్తూ రాజమండ్రి టు చెన్నై తిరిగేవాడట ఆలీ. తన కష్టంతో స్టార్ కమెడియన్ గానే కాకుండా హీరోగా కూడా నటించాడు. పూరి జగన్నాధ్, పవన్ కల్యాణ్ సినిమాల్లో రెగ్యులర్ కమెడియన్ ఆలీ. రాజమండ్రిలో తన తండ్రి పేరిట పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇటివలే ఆయన తన మాతృమూర్తిని కూడా కోల్పోయాడు. ప్రేక్షకుల్ని నవ్వించే హాస్యనటుల వెనుక కష్టాలు ఉంటాయనటానికి ఆలీ ఓ నిదర్శనం.

మరింత సమాచారం తెలుసుకోండి: