సినిమాల్లో కొందరు నటులు పోషించే పాత్రలు ఎంతటి సెన్షేషన్ క్రియేట్ చేస్తాయో తెలిసిన విషయమే. ఆయా పాత్రలకు వారికి వచ్చిన గుర్తింపు వారి సినీ ప్రయాణానికి వారధిలా నిలుస్తూంటాయి. అదే పేరు తమ్ స్క్రీన్ నేమ్ గా వారు కూడా ఊహించలేనంతగా.. వారి ప్రమేయం లేకుండానే సెట్ అయిపోతూ ఉంటాయి. అలాంటి వారిలో మల్లికార్జున రావు కూడా ఒకరు. మల్లికార్జున రావు ఎవరు.. అనే సందేహం రావచ్చు గానీ.. ‘బట్టల సత్తిగాడు’ అంటే మాత్రం తెలుగు సినీ ప్రేక్షకులకు ఠక్కున గుర్తొచ్చేశారు ఆ హాస్యనటుడు.

 

 

1986లో వంశీ దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన లేడీస్ టైలర్ సినిమా ఆయన సినీ జీవిత గమనాన్ను మార్చేసింది. అప్పట్లో ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సినిమా ఆద్యంతం ఎంత కామెడీ ఉంటుందో బట్టల సత్తి పాత్రకు అంత ప్రాధాన్యం ఉంటుంది. పల్లెటూళ్లో సైకిల్ మీద ఇంటింటికీ తిరుగుతూ బట్టలు అమ్మే వ్యక్తి పాత్ర అది. ఆ ఊరిలో ఉన్న ఏకైక టైలర్ సుందరంతో ఒప్పందం కుదుర్చుకుని ఇబ్బందులు పడే కామెడీ క్యారెక్టర్ లో మల్లికార్జున రావు జీవించారనే చెప్పాలి. ఆ సినిమాతో రాజేంద్రప్రసాద్ స్టార్ హీరో అయిపోతే.. మల్లికార్జున రావు బట్టల సత్తిగా అంతే పాపులర్ అయిపోయి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.

 

 

సినిమా సృష్టించిన ప్రభంజనం తర్వాత మల్లికార్జున రావు తిరిగి చూసింది లేదు. ఎన్నో సినిమాల్లో అత్యద్భుతమైన కామెడీ చేశారు. ఏప్రిల్ 1 విడుదల, హలో బ్రదర్, తమ్ముడు, బద్రి.. ఇలా ఎన్నో సినిమాల్లో తన పాత్రకు న్యాయం చేశారు. దాదాపు 375 సినిమాల్లో నటించిన ఆయన 2008లో అనారోగ్యంతో మరణించారు. తన హాస్యంతో నవ్వించి.. తన మరణంతో ప్రేక్షకులందరినీ బాధకు గురి చేసారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: