ప్రస్తుతం సమాజంలో తీరు మారిపోతుంది. గతంలో ఉన్న నైతిక విలువలు... బంధాలు... అనుబంధాలు పోయి ఇప్పుడు కుట్రలు, కుతంత్రాలు, కుళ్లు రాజ్యమేలుతున్నాయి. ఏ రంగంలో అయినా ఒకరు పైకి ఎదుగుతున్నారు... అంటే ఆ కింద ఉన్న వాళ్ళు ఓర్వలేక పోతున్నారు. వాళ్లను ఏ రకంగా బ‌ద్నాం చేయాలి అని కుట్రలు, కుతంత్రాలు రచిస్తున్నారు. ఇది సినిమా రంగంలోనూ ఉంది. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌ కొన్నేళ్లుగా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోయాడు. అయితే విజ‌య్‌ చాలా త‌క్కువ టైంలోనే మూడు బ్లాక్ బస్ట‌ర్ హిట్లు కొట్టాడు. అక్క‌డితో ఆగ‌కుండా విజ‌య్ కు నైజాం మార్కెట్లో మంచి గ్రిప్ వ‌చ్చేసింది.



విజ‌య్ దేవ‌ర‌కొండ తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తి కావ‌డంతో అత‌డి సినిమాలు వ‌స్తున్నాయంటే నైజాం మార్కెట్లో దుమ్ము రేగుతోంది. పైగా సామాజిక స‌మీక‌ర‌ణ‌లు క‌లిసి రావ‌డం.. అటు కేటీఆర్ సైతం ప్రోత్స‌హిస్తుండ‌డంతో దూసుకు పోయాడు. అయితే ఇదే ఇండ‌స్ట్రీలో శాసించే ఓ ఫ్యామిలీకి కంట‌గింపుగా మారింద‌ట‌. ఆ ఫ్యామిలీ హీరోల‌కు ఏపీ, సీడెడ్ క‌న్నా నైజాంలో మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పుడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ నైజాం మార్కెట్ శాసిస్తే త‌మ ఫ్యామిలీ హీరోల‌కు ఎక్క‌డ దెబ్బ ప‌డుతుందో ? అని విజ‌య్ ను తెర‌వెన‌క తొక్కేలా ఆ ఫ్యామిలీ హీరోలు, ఆ కాంపౌండ్ వాళ్లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.



ఈ విష‌యం ఇప్పుడు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో బాగా వైర‌ల్ అవుతోంది. అందుకు త‌గ్గ‌ట్టే విజ‌య్ సినిమాలు అత‌డి దుర‌దృష్టం కొద్ది ప్లాప్ కూడా అవుతున్నాయి. ఇక విజ‌య్ సినిమాలు వ‌స్తున్నాయంటే చాలు తొలి రోజు నుంచే ప్లాప్ ట‌క్ తీసుకు రావాల‌ని... త‌మ అభిమానుల ద్వారా సోష‌ల్ మీడియాలో బ్యాడ్ టాక్ ప్ర‌చారం చేయించాల‌ని ఆ ఫ్యామిలీ కాంపౌండ్ గ్యాంగ్ కంక‌ణం కూడా క‌ట్టుకుంద‌ట‌. వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్ ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వ‌డం వెన‌క వాళ్ల ప్లాన్ కూడా ఉంద‌ని టాక్‌..? 

మరింత సమాచారం తెలుసుకోండి: