ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను కరోనా వైరస్ భయభ్రాంతులకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా బారిన పడి ఇప్పటికే 3000 మంది మృతి చెందగా 89,000 మంది కరోనా బాధితులుగా ఉన్నారు. గతంతో పోలిస్తే కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతున్నా ప్రజలు మాత్రం కరోనా పేరెత్తితే బెంబేలెత్తిపోతున్నారు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ భారత్ లో ఈరోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు పేర్కొంది. 
 
తాజాగా ఈరోజు మధ్యాహ్నం తెలంగాణలో దుబాయ్ నుండి హైదరాబాద్ నుండి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా సోకినట్లు వార్తలు వచ్చాయి. ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి కరోనాకు స్వాగతం అని కామెంట్లు చేశారు. అంతేకాదు కరోనాకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఛార్మి టిక్ టాక్ లో కరోనాను స్వాగతిస్తూ ఒక టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేశారు. నెటిజన్లు ఈ వీడియోలో ఛార్మి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. 
 
ఈ వీడియో వివాదాస్పదం కావడంతో ఛార్మి వీడియోను డిలేట్ చేశారు. ప్రపంచమంతా కరోనా పేరు చెబితే భయభ్రాంతులకు గురవుతోందని సెలబ్రిటీ హోదాలో ఉన్న ఛార్మి కరోనాను స్వాగతించడమేమిటని ప్రశ్నించారు. ఎందుకు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేస్తున్నావ్ ఛార్మి అంటూ నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. నిర్మాతగా సరైన హిట్ కొట్టక మైండ్ బ్లాంక్ అయిందా అని ప్రశ్నిస్తున్నారు.                       
 
సెలబ్రిటీ హోదాలో ఉన్నవారు సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే మాత్రం మొదటికే మోసం వస్తుంది. గతంలో కూడా కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో వివాదాస్పద వీడియోలు, పోస్టులు పోస్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్నారు. ఇకనుండైనా ఛార్మి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు జాగ్రత్తగా వ్యవహరిస్తుందేమో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: