యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ హిట్ గత శుక్రవారం విడుదలై డీసెంట్ టాక్ ను రాబట్టుకోవడంతో మొదటి వారాంతంలో పర్వాలేదనే వసూళ్లను రాబట్టి బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. మూడు రోజుల్లో ఈచిత్రం తెలుగు రాష్ట్రాల్లో 3.17కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. మరో కోటి రూపాయలు రాబడితే చాలు బ్రేక్ ఈవెన్ అయ్యినట్లే .. ప్రస్తుతం పెద్ద సినిమాల విడుదలలేనందున ఫుల్ రన్ లో హిట్ 6కోట్ల షేర్ వరకు రాబట్టుకోనుంది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రం హిట్ దిశగా దూసుకుపోతుంది. ఇప్పటివరకు అక్కడ 200k డాలర్ల ను రాబట్టిందని సమాచారం.
నూతన దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రంలో చి ల సౌ ఫేమ్ రుహాణి శర్మ హీరోయిన్ గా నటించగా వివేక్ సాగర్ సంగీతం అందించాడు. వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ఈ సినిమాను నేచురల్ స్టార్ నాని ,ప్రశాంతి త్రిపురనేని సంయుక్తంగా నిర్మించారు.
హిట్ మూడు రోజుల వసూళ్ల వివరాలు :
నైజాం - 1. 6 కోట్లు
సీడెడ్ - 0.3 కోట్లు
ఉత్తరాంద్ర - 0.34 కోట్లు
గుంటూరు - 0.25 కోట్లు
కృష్ణా - 0.26 కోట్లు
నెల్లూరు - 0.09 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మూడు రోజుల షేర్ = 3.17 కోట్లు