తెలుగు ఇండస్ట్రీలో ఆంటీ క్యారెక్టర్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది ప్రగతి. తల్లి, అక్క, వొదిన పాత్రల్లో నటించే ప్రగతి ఈ క్యారెక్టర్లను తనకు 25 ఏళ్లునప్పుడే చేయాల్సి వచ్చిందట. తను అక్కాచెల్లెళ్లు సీరియల్లో నటిస్తున్నప్పుడు సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి తనకు కాల్ వచ్చిందట. ఆర్తీ అగర్వాల్ తల్లిగా నటించమని అడిగారట.  ఆ సమయంలో ఇద్దరి వయసు ఇంచు మించు ఉండటం ఆ వయసులో ప్రగతి కూడా చాలా అందంగా ఉండటం ఆ క్యారెక్టర్ డామినేట్ చేస్తుందేమో అన్న అనుమానాలు వ్యక్తం చేసిందట.  కానీ ఆమెను ఈ మూవీలో కాస్త పెద్ద వయసులా కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవడంతో అప్పటి నుంచి ప్రగతి ఆంటి పాత్రలే కంటిన్యూగా వచ్చాయట.

 

యంగ్ ఏజ్‌లోనే దాదాపు తన వయసుకు సమానంగా ఉండే యువ హీరోలోకు తల్లిగా నటించి మెప్పించి నటి ప్రగతి. ప్రస్తుతం టాలీవుడ్‌లో తల్లి పాత్రలకు చిరునామాగా మారింది. ఏడాదికి దాదాపు 25 చిత్రాల్లో తల్లి పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు గ్లామర్ తెస్తున్నది. టెలివిజన్ రంగంలో అక్కాచెల్లెలు సీరియల్‌లో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్న సమయంలో సురేష్ ప్రొడక్షన్ నుంచి ఆఫర్ రావడం తన కెరీర్ పూర్తిగా మారిపోయిందని అంటుంది. అల్లు అర్జున్, రాంచరణ్, లావణ్య త్రిపాఠి, కాజల్ లాంటి యువ హీరో, హీరోయన్ల తొలి చిత్రాలలో తల్లి పాత్రను పోషించాను.

 

 అయితే తాను కొంత మంది స్టార్ హీరోలకు తల్లి పాత్రలో కనిపిస్తుంటే వారే ఆశ్చర్యపోతుంటారని అంటుంది ప్రగతి.  తాము తెరపై అలా కనిపించినా  సెట్స్ బయట మాత్రం చాలా ఫ్రెండీగా గడుపుతుంటామని అంటుంది. అప్పట్లో డమరుకం చిత్రంలో అనుష్కకు తల్లిగా నటించాల్సి వచ్చినపుడు ఆమె చాలా బాధపడిందని ఆమె చెప్పారు. అయ్యో పాపం.. ఆమె చాలా యంగ్, ఆమె నాకు తల్లి నటించడం ఏమిటీ అని అనుష్క అన్నారని ప్రగతి తెలిపింది.  వాస్తవానికి తనకు  హీరోయిన్ కావాలనే ఆశ ఉన్నా.. క్యారెక్టర్ పాత్రలోనే ఒదిగిపోవాల్సి వచ్చిందని అంటుంది ప్రగతి.  

మరింత సమాచారం తెలుసుకోండి: