‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ ఇంకా పూర్తి కాకుండానే జూనియర్ త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించిన ప్రకటన అధికారికంగా వేలువడటమే కాకుండా త్రివిక్రమ్ ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ విషయమై అదేవిధంగా నటీనటుల ఎంపిక విషయమై తన వేగాన్ని పెంచాడు. దీనితో రామ్ చరణ్ ఈ పరిణామాలను పసిగట్టి తాను కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత చేయబోయే ప్రాజెక్ట్ విషయమై చాల లోతుగా ఆలోచిస్తున్నట్లు టాక్. 


తెలుస్తున్న సమాచారం మేరకు ఈ విషయమై చరణ్ గతంలో అతడు ‘మగధీర’ తరువాత అనుసరించిన విధానాలను మళ్ళీ ఫాలో అవుతున్నట్లు టాక్. రామ్ చరణ్ ‘మగధీర’ తరువాత ‘ఆరెంజ్’ మూవీతో ఒక వెరైటీ ప్రేమ కథను చేసాడు. అయితే ఆ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో ఆ తరువాత చరణ్ ఏమాత్రం అంచనాలకు అవకాశం ఇవ్వకుండా సంపత్ నంది దర్శకత్వంలో మూవీని చేసి అందరికీ షాక్ ఇవ్వడమే కాకుండా హిట్ ను కూడ అందుకున్నాడు. 


ఇప్పుడు అదే పరిస్థితి చరణ్ రిపీట్ చేయబోతున్నాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు చరణ్ ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత నటించబోయే సినిమా విషయంలో కథలకు సంబంధించి సుజిత్ వెంకీ కుడుముల అనీల్ రావిపూడి లతో ప్రస్తుతం చర్చలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


అంతేకాదు ఎవరైనా యంగ్ డైరెక్టర్ ఒక మంచి కథతో వస్తే తాను ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత అవకాశం ఇస్తాను అంటూ లీకులు కూడ ఇస్తున్నట్లు సమాచారం. ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ప్రయోగాల జోలికి పోకుండా త్రివిక్రమ్ లాంటి దర్శకుడితో ‘ఆర్ ఆర్ ఆర్’ తరువాత సినిమా చేస్తుంటే చరణ్ మాత్రం గతంలో ‘మగధీర’ తరువాత చేసినట్లుగా మరొక ప్రయోగానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు లీకులు వస్తున్న పరిస్థితులలో రామ్  చరణ్ పొరపాటు చేస్తున్నాడా అంటూ కొందరు సందేహాలు వ్యక్తపరుస్తున్నట్లు టాక్..   

మరింత సమాచారం తెలుసుకోండి: