న్యాచురల్ స్టార్ నాని వరుస సినిమాలో నటిస్తున్నారన్న సంగతి తెలిసిందే.. ఇటీవల వచ్చిన నాని సినిమాలన్నీ కూడా భారీ ఘన విజయాన్ని అందుకుంటూ వస్తున్నాయి. కాగా ఇటీవల విడుదల అయ్యి ప్రేక్షాదరణ పొందిన సినిమా గ్యాంగ్ లీడర్ సినిమా హిట్ టాక్ తో పాటుగా కలెక్షలను భారీగానే అందుకుంది. 

 

 


ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రేమకథ చిత్రం ఫెమ్ హీరో సుధీర్ బాబు కూడా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇక సుధీర్ బాబు పొలిసు పాత్రలో నటిస్తున్నారు. దాదాపుగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఉగాది కానుకగా మార్చ్ 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

 


తదుపరి సినిమాగా శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నిన్ను కోరి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా సంగతి తెలిసిందనే.. వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రానుందని వార్తలు వినపడ్డాయి. అయితే ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విభిన్న కథాశంతో ఈ సినిమా రూపొందుతుంది. 

 

 


'టక్ జగదీశ్' ఇంట్రెస్టింగ్ టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో నాని సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. కాగా ఈ సినిమా షూటింగ్ మార్చి 3 వ తేదీన రాజమండ్రిలో జరగనుందని సమాచారం. అందుకోసం ఈ చిత్ర బృందం రాజమండ్రిలో ఉన్నట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ పనులను పూర్తిచేసుకొని ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు సినిమా రానుందని చిత్రయూనిట్ ప్రకటిస్తుంది. లవ్ స్టోరీలను తెరకెక్కిస్తూ వస్తున్నా శివ నిర్వాణ ఈ సినిమాను కూడా అలానే రూపొందిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: