మనుషులను పోలిన మనుషులు ఉంటూనే ఉంటారు. సహజంగా రక్తసంబంధీకుల్లో ఇలా జరుగుతుంది. ఇక కవల పిల్లల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఎలాంటి రక్త సంబంధం లేకుండా మనుషులను పోలిన మనుషులు ఉండటం చాలా అరుదు. కానీ అలాంటి అరుదైన వ్యక్తులు అక్కడక్కడా కనిపిస్తుంటారు.

 

 

ఇప్పుడు అదే జరిగింది. హీరోయిన్ సమంత లాగానే ఉన్న ఓ అప్ కమింగ్ హీరోయిన్ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈమెను అకస్మాత్తుగా చూస్తే సమంతానే అనుకుంటారు. అంతగా ఈ అమ్మాయిలో సమంత పోలికలు ఉన్నాయి. సమంత చెల్లి అంటే ఇట్టే నమ్మేస్తారు.

 

IHG

 

అయితే సమంతా కూ ఈ అమ్మాయికీ అసలు సంబంధమే లేదట. సెలెబ్రిటీలని పోలిన వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వారు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతారు. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలోనూ అదే జరుగుతోంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరో చెప్పనే లేదు కదా..

 

IHG

 

 

అమ్మాయి పేరు ఆత్మిక. తమిళంలో ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటోంది. ఇప్పటికే మీసాయ మురుక్కు, కాట్టేరి లాంటి చిత్రాల్లో నటించింది. అయితే అచ్చు సమంతలాగానే ఉండటంతో అవకాశాలు కూడా బాగానే వస్తున్నాయట. ఈ ఆత్మిక సినిమాల కోసం బాగానే ట్రై చేస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ నలుగురి కళ్లలో పడుతోంది. ముఖ్యంగా వైట్ డ్రెస్, బ్లాక్ టాప్, శారీ లుక్ లోని కొన్ని యాంగిల్స్ లో ఆత్మిక సమంత లాగానే కనిపిస్తోంది.

 

IHG

 

 

ఈ అమ్మాయిపై సోషల్ మీడియాలోను జోరుగా కామెంట్లు వస్తున్నాయి. పాపం నాగ చైతన్య ఈ అమ్మాయిని చూస్తే సమంతానే అనుకుని ఏమైనా చేసేయగలడు అంటూ కొందరు హాస్యమాడుతున్నారు. అయితే ఇంకా ఈ అమ్ముడుపై మన టాలీవుడ్ దర్శకుల కళ్లుపడినట్టు లేవు. సమంత క్రేజ్ ను వాడుకునేందుకైనా ఈ అమ్మాయిని టాలీవుడ్ కు తీసుకొస్తారు.

 

IHG

 

IHG

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: