సాంకేతికత తో ఎన్ని లాభాలు ఉన్నాయో అదే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో టెక్నాలజీ కారణంగా చాలానే ఇబ్బందులు ఎదుర్కొంటొంది. ముఖ్యంగా పైరసీ కారణంగా సినీ రంగం ఎన్నో ఇబ్బందులు పడుతుంది. సినిమా రిలీజ్ అయిన 24 గంటల్లోనే పైరసీ వర్షన్‌లు ఆన్‌లైన్‌లోకి వచ్చేస్తుండటంతో సినీ రంగానికి తీవ్ర నష్టం జరుగుతోంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో సినిమా రిలీజ్‌కు ముందే సినిమాలోని కొన్ని సీన్స్‌ ఆన్‌ లైన్‌లో లీక్‌ అవుతుండటం దర్శక నిర్మాతలను కలవరపెడుతోంది.

 

అలా రిలీజ్‌ అయిన సన్నివేశాల్లో హాట్ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ముందుగా చెప్పుకోవాల్సిన సినిమా లిప్‌స్టిక్‌ అండర్‌ మై బుర్ఖా. ఈ సినిమా రిలీజ్‌కు అభ్యంతరం చెప్పిన సెన్సార్ బోర్డ్ సినిమాలోని చాలా సన్నివేశాలను కట్ చేసింది. అయితే సినిమా రిలీజ్‌ కు ముందే సెన్సార్ బోర్డ్ తొలగించిన సన్నివేశాలతో కలిపి పూర్తి సినిమా ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యింది. వివాదాస్పద బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ నటించిన అనార్కలి ఆప్‌ అరాహ్‌ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ సినిమాలో స్వర భాస్కర్‌, సంజయ్‌ మిశ్రాల మద్య తెరకెక్కించిన హాట్ సీన్ సినిమా రిలీజ్‌కు ముందే సోషల్ మీడియాలో హల్‌ చల్‌ చేసింది.

 

సౌత్‌ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించిన సినిమా పర్చెడ్‌. ఈ సినిమాలో బోల్డ్ సీన్స్‌లో నటించిన రాధిక. ముఖ్యంగా ఆదిల్ హుస్సేన్‌తో ఓ ఇంటిమేట్‌ సీన్ చేసింది. అయితే  ఆ సీన్‌ సినిమా రిలీజ్‌కు ముందే లీకైంది. బాలీవుడ్‌ సీరియల్‌ కిస్సర్‌ ఇమ్రాన్ హష్మి హీరోగా తెరెకెక్కిన హాట్ మూవీ రష్‌. ఈ సినిమా రిలీజ్‌ ఆలస్యమైన సినిమాలోని హాట్ సీన్స్‌ మాత్రం ముందే నెట్‌లో హల్‌ చల్‌ చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: