సినిమాల్లో ఓ సన్నివేశంలో ముద్దు అవసరమైనప్పుడు ఇక్కడ ఆ సీన్ ఉంటే బాగుండును అనిపిస్తుంది. అలాంటి సన్నివేశాలు ప్రేక్షకులను ఏమాత్రం ఇబ్బంది పెట్టవు. పైగా ఆ సన్నివేశం పండుతుంది.. ప్రేక్షకులకు నచ్చుతుంది కూడా. అదే ఇద్దరు స్టార్స్ మధ్య ఓ ముద్దు సన్నివేశం వస్తే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సౌత్ బ్యూటీ త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన తీన్ మార్ సినిమాలో ఈ సన్నివేశం జరిగింది.

 

 

పవన్ కల్యాణ్ క్రేజ్, త్రిష క్రేజ్ తో తీన్ మార్ లోని సన్నివేశం బాగా వచ్చింది. 2011లో వచ్చిన ఈ సినిమా నేపథ్యం అంతా ఇద్దరు బ్యాచిలర్స్ మధ్య కథ నడుస్తుంది. అచ్చం డేటింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా చూస్తున్న ఎవరికైనా హీరో హీరోయిన్ల మధ్య ఓ ముద్దు సీన్ ఉంటే బాగుంటుందనే అనిపిస్తుంది. దీంతో దర్శకుడు జయంత్ సి.పరాన్జీ వీరిద్దరితో ఓ ముద్దు సీన్ ప్లాన్ చేశాడు. ఈ సీన్ సినిమాలో హైలైట్ గా నిలిచింది. సాయంత్రం వేళలో, సముద్ర తీరం వద్ద పవన్ – త్రిషల లిప్ టు లిప్ కిస్ కు మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తోడై ఆ సీన్ ను ఆహ్లాదకరంగా మార్చేస్తుంది.

 

 

ఈ సీన్ సినిమా కాన్సెప్ట్ కి కరెక్ట్ గా యాప్ట్ అయిందని చూసిన వారెవరికైనా అనిపిస్తుంది. సినిమాల్లో పవన్ కల్యాణ్ పెట్టిన తొలి లిప్ టు లిప్ కిస్ కూడా ఇదే. పవన్ వద్దని వారించినా సీన్ గురించి వివరించి పవన్ ను ఒప్పించానని జయంత్ ఓ సందర్భంలో చెప్పాడు. సినిమా ఫ్లాప్ అయినా.. పవన్త్రిష లిప్ కిస్ మాత్రం అభిమానులను అలరించింది. వీరిద్దరి కాంబోకి, కెమిస్ట్రీకి మంచి పేరు వచ్చింది కూడా.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: