తెలుగులో చిరంజీవి తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తమదైన డ్యాన్సింగ్ స్కిల్స్ తో అలరిస్తున్నారు. వీరి డ్యాన్సులకు తెలుగు ప్రేక్షకులే కాదు ఇతర భాషా సినీ పరిశ్రమల్లో కూడా అభిమానులు ఉన్నారు. వారిలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా ఉన్నాడు. తానో మంచి డ్యాన్సర్ అయ్యుండి కూడా తెలుగులో ఓ హీరో డ్యాన్స్ అంటే ఎంతో ఇష్టమంటూ చెప్పుకొచ్చాడు. రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఓ బ్రాండ్ ప్రమోషన్ కార్యాక్రమానికి హాజరయ్యాడు హృతిక్. అక్కడ ఓ టీవీ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పాడు.

 

 

‘అల్లు అర్జున్ డ్యాన్సులపై మీ అభిప్రాయమేంటి’ అని యాంకర్ అడిగిన ప్రశ్నకు.. “ఓ మై గాడ్.. హి ఈజ్ ఎనర్జిటిక్.. స్ట్రాంగ్ అండ్ ఇన్ స్పైరింగ్” అంటూ బన్నీ డ్యాన్సులపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. బన్నీ డ్యాన్సులు ఎంతో బాగుంటాయి.. అతని డ్యాన్సులు ఇతరులను ఇన్ స్పైర్ చేస్తూంటాయి అని బాలీవుడ్ డ్యాన్సింగ్ హీరోనే చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. బన్నీ అభిమానులైతే హృతిక్ మాటలతో పండగ చేసుకుంటున్నారు. తమ హీరో డ్యాన్సులను పొగడటం తమకెంతో ఆనందంగా ఉందని సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. బన్నీతో పాటు తమిళ హీరో విజయ్ డ్యాన్సులు కూడా తనకు నచ్చుతాయని అన్నాడు. డ్యాన్సులు చేయటానికి ముందు వీళ్లేం తింటారో అని కూడా సరదా వ్యాఖ్య చేశాడు.

 

 

బన్నీ డ్యాన్సులకు దక్షిణాది భాషలతోపాటు హిందీలో కూడా అభిమానులు ఉన్నారు. హిందీ ప్రస్తుతం హృతిక్ మాటలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. తెలుగు సినిమాల్లో హీరోలు తమ టాలెంట్ ఎంత యాడ్ చేసినా ప్రేక్షకులు ప్రత్యేకంగా ఆశించేది మాత్రం వారు డ్యాన్స్ ఎలా చేస్తున్నారనే. తెలుగు సినిమాను అలా మార్చేసింది మెగాస్టార్ చిరంజీవి అనేది కూడా నిజం. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: