తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు రాజ్ కోటి సంగీతం అంటే ఆ చిత్రం ఖచ్చితంగా హిట్ అన్నమాటే.  తమ సంగీతంతో కోట్ల మంత్రి హృదయాలు గెల్చుకున్నారు రాజ్-కోటి.  తర్వాత ఎవరికి వారు విడిపోయి.. తమ ప్రత్యేకతను చాటుకున్నారు.  కోటికి  హలో బ్రదర్ చిత్రానికి 1994 లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సంగీత దర్శకులైన మణిశర్మ, ఏ. ఆర్. రెహ్మాన్ టాంటి దిగ్గజ సంగీత దర్శకుడు ఈయన వద్ద శిష్యరికం చేసినవారు కావడం విశేషం. ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన పనిచేశారు.  ప్రస్తుతం ఆయన టెలివిజన్ లో వస్తున్న పలు సంగీత పరమైన రియాల్టీ షోలకు  కార్యక్రమాలకు జడ్జీగా వ్యవహరిస్తున్నారు.   

 

తాజాగా సంగీత దర్శకులు కోటి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన జీవితంలో జరిగిన కొన్ని జ్ఞాపకాలను పంచుకున్నారు.  బాలకృష్ణతో ఎస్.గోపాల్ రెడ్డిగారు ఒక చిత్రాన్ని  నిర్మించడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ చిత్ర దర్శకుడిగా ఈవీవీ సత్యనారాయణను తీసుకున్నారు.  ఆ సమయంలో సంగీత దర్శకుడిగా నన్నునేన్ నిరూపించకుంటున్న రోజులు.. ఆ సమయంలో ఏ దర్శకుడైనా అన్ని విధాలు ఆలోచించి సంగీత దర్శకుడి విషయంలో నిర్ణయం తీసుకుంటారు.  ఈ క్రమంలో బాలయ్య చిత్రానికి సంగీత దర్శకుడిగా నా పేరు సూచించారు ఈవీవీ. 

 

కానీ అనుకోకుండా నా స్థానంలో మరో సంగీత దర్శకుడిని నిర్మాత చూపించడంతో ఈవీవీ ఆశ్చర్యపోయారట.  కోటి మంచి సంగీతాన్ని అందిస్తారన్న నమ్మకం తనకు ఉందని.. అందుకే తన పేరు సూచించానని... ఒకవేళ తనను తీసుకోకపోతే ఆ చిత్రానికి తాను కూడా పని చేయనని తప్పుకున్నారు.  అలా ఈవీవీ నా కోసం ఒకటి కాదు రెండు వదులుకున్నాడు.  నిజంగా ఆయన స్నేహం.. ఆయన త్యాగం నా జీవితాంతం మర్చిపోలేనని అన్నారు. అప్పట్లో ఈవీవీకి నాకు మద్య ఉన్న అనుబంధం అంత గొప్పగా ఉండేదని గుర్తు చేసుకున్నారు కోటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: