సినిమా ఇండస్ట్రీ అంతా గ్లామర్ మీదే ఆధారపడి ఉంటుంది. హీరోయిన్ అందం సినిమాకు అదనపు ఆకర్షణ అవుతుంది. నిజానికి హీరోయిన్ మాత్రమే సినిమాకు కలర్ ఇస్తుంది.. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ను ధియేటర్లకు రప్పిస్తుంది కూడా. అలా తన అందంతో తొంభై దశకంలో తన హవా చాటిన భామల్లో రంభ మొదటి వరుసలో ఉంటుంది. 1992లో వచ్చిన ఆ ఒక్కటీ అడక్కు సినిమా ద్వారా సినిమా రంగానికి పరిచయమైన రంభ దాదాపు దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా రాణించింది.

IHG

 

తొలి సినిమా ఆ ఒక్కటీ అడక్కు సినిమాలోనే బికినీ వేసి ఓ సెక్షన్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసింది. అటుపై స్టార్ హీరోయిన్ గా రాణిస్తూ సందర్భానుసారం పలు సినిమాల్లో బికినీ, స్విమ్ సూట్ లు వేసింది. 1997లో వచ్చిన బొంబాయి ప్రియుడు సినిమాలో రంభ ఓ పాటలో వేసిన స్విమ్ సూట్ వేసింది. ఆ పాటలో రంభ ఎంతో గ్లామర్ ఒలకబోసింది. ఆ పాటలో కోయాక్టర్ పై ఫిర్యాదు చేయడంతో అప్పట్లో సంచలనమైంది కూడా. చిరంజీవి అల్లుడా మజాకా సినిమాలో రంభ బికినీ ధరించడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. తమిళంలో ఉళిత్తా ఉళిత్తై అనే సినిమాలో స్విమ్ సూట్ వేసి తమిళ తంబిలను ఆకట్టుకుంది.

IHG

 

రంభ బొద్దుగా ఉన్నా కూడా తెలుగు, తమిళ సినిమాల్లో రాణించంది. స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ ఛాయిస్ అయింది. చిరంజీవి, రజినీకాంత్ తో సహా ఎందరో స్టార్ హీరోల సినిమాల్లో మెయిన్ హీరోయిన్ గా నటించింది. చాలా సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసింది. తొంభై దశకం మొత్తం స్టార్ హీరోయిన్ల కేటగిరీలో రంభ పేరు మోగిపోయిందనే చెప్పాలి. హిందీలో కూడా పలు సినిమాలు చేసిన రంభ హిందీ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది.

 

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: