ఈవారం విడుదల అవుతున్న అనేక చిన్న సినిమాలలో ‘పలాస 1978’ పై అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ప్రమోషన్ ను కూడ చాల విభిన్నంగా చేస్తున్నారు. ఊహించని విధంగా ఈ సినిమా సైలెంట్ హిట్ అవుతుందా అంటూ మరికొందరు అంచనాలు వేస్తున్నారు. గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె విలన్ గా నటిస్తున్న ఈ మూవీతో ఇతడికి బ్రేక్ వస్తుందా అన్న సందేహాలు కొందరికి కలుగుతున్నాయి. 


సినిమా 1978 కాలం నాటి పరిస్థితుల గురించి అప్పుడు ఉన్న కుల వివక్ష గురించి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న పలాస నేపధ్యంలో ఉంటుంది. అనేక వాస్తవ సంఘటనలు ఆధారంగా తీసిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు అనేక కట్స్ చెప్పి కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేసింది అన్న వార్తలు కూడ వస్తున్నాయి. 


ఇప్పుడు ఈ సినిమా గురించి వెంకటేష్ టెన్షన్ పడుతున్నాడు అంటూ ఒక ఆసక్తికర న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తోంది. ప్రస్తుతం వెంకటేష్ నటిస్తున్న ‘అసురన్’ రీమేక్ నారప్ప లో కూడ ఈ కులాల మధ్య వార్ సీన్స్ చాల కీలకంగా ఉంటాయి. తమిళనాడులో ఘన విజయం సాధించిన ఈ మూవీని చాల మోజుపడి వెంకటేష్ తెలుగులో రీమేక్ చేయిస్తున్నాడు. 


ఈ సినిమాకు దర్శకత్వం వహించే విషయంలో చాలామంది దర్శకులు వెనక్కు తగ్గితే వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాలను ఒప్పించి ఈ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ కోసం తన లుక్ ను మార్చుకోవడమే కాకుండా తన నటన విషయంలో కూడ చాల వైవిద్యం చూపెడుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ వారం విడుదల కాబోయే ‘పలాస 1978’ సినిమాలో సీన్స్ ‘నారప్ప’ లో సీన్స్ ఒకేవిధంగా ఉంటే జనం చూస్తారా అంటూ వెంకటేష్ టెన్షన్ పడుతున్నట్లు టాక్. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ‘పలాస’ మూవీని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సురేశ్ మూవీస్ ‘నారప్ప’ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తూ ఉండటం యాధృశ్చికం.. 

మరింత సమాచారం తెలుసుకోండి: