బీచ్‌ లంటేనే అందాల భామలు బికినీ ట్రీట్. ఇండియాలోని దాదాపు అన్ని బీచ్‌లలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక విదేశాల్లో అయితే ఆ గ్లామరే వేరు. టూ పీస్‌ బికినీల్లో అలలతో పోడిపడే అమ్మాయిలను చూస్తే చూపు తిప్పుకోలేం. అందుకే హాలీడే ట్రిప్‌ అంటే బీచ్‌ బేలను ప్రిఫర్‌ చేస్తుంటారు టూరిస్ట్‌లు అయితే అన్ని బీచ్‌లు ఒకలా ఉండవు. అసలు అమ్మాయిలను బికినీల్లో అనుమతించని బీచ్‌లు కూడా ఉన్నాయి. అందుకే అలాంటి బీచ్‌ల వైపుకూడా చూడరు మన ముద్దుగుమ్మలు.

 

ముస్లిం దేశాల్లో ఇలాంటి నిబంధనలు మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రాస్ అల్-ఖైమా రాష్ట్రం సముద్ర తీరాల్లో పురుషులు, మహిళలు ఇద్దరూ బికినీలు లేదా స్విమ్మింగ్‌ డ్రెస్‌లు ధరించడం నిషేదం. అయితే ఇక్కడికి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న దుబాయ్ బీచ్ లలో ఇలాంటి నిషేధం లేదు. కానీ బీచ్ లకు వెళ్లే వారికి అధికారులు ఇతర సందర్శకులకు ఇబ్బంది లేకుండా గౌరవప్రదంగా నడుచుకోవాలని సూచనలు చేస్తుంటారు.

 

ఇండియన్‌ టూరిస్ట్‌లు ఎక్కువగా వెళ్లే పర్యాటక కేంద్రం మాల్వీవులు. ఈ బీచ్‌లలో ఎంజాయ్ చేయడానికి దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్ట్‌లు వస్తుంటారు. అయితే ఇక్కడ పబ్లిక్ బీచ్ లలో ఈత దుస్తులు, బికినీలు ధరించడం నిషేధం. కొన్ని రిసార్ట్ బీచ్ లలో మాత్రం బికినీలకు  అనుమతి ఉంది. ఇది ముస్లిం దేశం కావడంతో ఈ నియమాలను చాల స్ట్రిక్ట్‌గా పాటిస్తారు. అంతేకాదు నింబంధనలు మీరి ఎవరైనా ప్రవర్తిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు. హ్వార్, క్రొయేషియాలలోని బీచ్‌లో కూడా ఇలాంటి నిబంధనలు ఉన్నాయి. ఇది ప్రాచీన పట్టణం కావటంతో అప్పటికి సాంప్రదాయాలకు గౌరవం ఇచ్చేలా ఈ నిబంధనలు అమలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: