డబ్బులుంటేచాలు  ఎవరైనా హీరోగా సినిమాలు చేసేయ్యెచ్చు. హీరోగా సినిమా ఇండస్ట్రీకి  రావడం పెద్ద కష్టమేం కాదు. ఈ మద్య క్రౌడ్ ఫండింగ్ తో కూడా సినిమాలు చేసేస్తున్నారు. ఈ జనరేషన్ లో అన్నీ బావుంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోతున్నారు. కానీ సర్వైవల్ మాత్రం కష్టం అవుతోంది. 

 

విష్వక్ సేన్ .. ఫలక్ నుమా దాస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు . రా.. యాక్టింగ్ తో న్యాచురల్  అప్పియరెన్స్ తో తానే డైరెక్ట్ చేసి హీరోగా యాక్ట్ చేశాడు. ఫస్ట్ సినిమాతోనే .. చాలా ఇంటెన్సిటీ చూపించాడు యాక్టింగ్ లో. ఇంకేముంది వరుసగా సినిమా ఆఫర్లు వచ్చేస్తాయి సెటిల్ అయిపోతాడు అనుకున్నారు . కానీ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు. నాని ప్రొడ్యూసర్ గా  హిట్ టైటిల్ తో వచ్చిన   యాక్షన్ ధ్రిల్లర్ తో పెద్ద హీరోగా సెటిల్ అయిపోవాలని తాపత్రయ పడుతున్నాడు. 

 

కార్తికేయ..ఆర్ ఎక్స్ 100 తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.  ఇక వరుస ఆఫర్లు చెయ్యబోయే సినమాలతో ఫుల్ ఫామ్ లోకి వచ్చేస్తాడని ఎక్స్ పెక్ట్ చేశారు. కానీ తర్వాత చేసిన గుణ 369, 90 ఎమ్ ఎల్, సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అందుకే ఇంకా సర్వైవల్ కోసం ఇబ్బందిపడుతున్నాడు. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ లో ఇప్పుడు  చావు కబురు చల్లగా సినిమా తో మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుదామని ప్లాన్ చేస్తున్నాడు.


క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కొడుకు ఆకాష్ పూరి కూడా చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మెహబూబా లాంటి  డిఫరెంట్ డిఫరెంట్ సినిమాలు చేస్తున్నా.. హీరోగా ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడు ఈ యంగ్ యాక్టర్ . అందుకే ఈ సారి ఆడియన్స్ కి ఇచ్చే రొమాన్స్ డోస్ పెంచి రొమాంటిక్ సినిమాతో వస్తున్నాడు. ఈ సినిమాతో హీరోగా సెటిల్ అవుదామని చూస్తున్నాడు. . హీరో అంటే అంత ఈజీగా అయిపోతారా ఏంటి..? కష్టపడాల్సిందే మరి అంటున్నారు ఆడియన్స్

మరింత సమాచారం తెలుసుకోండి: