తన డెబ్భై ఒక్క సంవత్సరాల సినీ జీవితంలో అక్కినేని నాగేశ్వరరావు తెలుగు, తమిళ, హింది భాషలలో 250 పైగా సినిమాలను తీసి ఫిలిం ఇండస్ట్రీ కి అడుగులు నేర్పారు. రొమాంటిక్ మూవీస్, మైథాలజీ(పురాణ), మ్యూజికల్, కామికల్ మూవీస్ లలో బ్రహ్మాండంగా నటించి బహుముఖ ప్రజ్ఞ తో కూడిన వినయం గల గొప్ప నటుడిగా  పేరు పొందారు. అందుకే నాగేశ్వర రావు కి పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, రఘుపతి వెంకయ్య అవార్డు, పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి. అతనికి తెలుగు ప్రేక్షకులు నటసామ్రాట్ బిరుదుని కూడా ఇచ్చారు.

 

 


వాస్తవానికి అక్కినేని నాగేశ్వరరావు కాలంలో చాలామంది హీరోలు తమ సినిమా పాటలలో నడవటం, యాక్ట్ చేయడం తప్ప డాన్స్ చేసేవారు కాదు. కానీ అక్కినేని నాగేశ్వరరావు మాత్రం ఒక పాటకి కదలిక కావాలని, లయబద్ధంగా రమణీయమైన మూమెంట్ కావాలని చెప్పేసి ఆయనే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఏఎన్నార్ కు హార్ట్ సర్జరీ జరగకముందు మామూలుగా డాన్స్ చేసేవారు. కానీ హాట్ ఆపరేషన్ జరిగిన తర్వాత ఏఎన్ఆర్ కళ్లుచెదిరే డాన్స్ స్టెప్పులతో కంబ్యాక్ ఇచ్చి తనలోని ఓ మైఖేల్ జాక్సన్ ని ప్రేక్షకులకు చూపించారు. దసరా బుల్లోడు సినిమాలో ఏఎన్ఆర్ డాన్స్ చూస్తే అతని లో ఎంత పట్టుదలగా ఉందో అలవోకగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాలలో కేవలం డ్యాన్స్ చేయడం కోసం అతను ప్రాణాల మీదకు కూడా తెచ్చుకున్నాడు. మొదటిగా డాన్స్ ట్రెండ్ ని ప్రారంభించిన అక్కినేని నాగేశ్వర్ రావు ని చాలా మంది ఫాలో అయ్యి వాళ్లు కూడా డాన్స్ చేయడం ప్రారంభించారు. 

 


ఇకపోతే అక్కినేని నాగేశ్వర రావు, అందాలతార శ్రీదేవి తో కలిసి గంగ్నమ్ స్టయిల్ లెవెల్ లో డాన్స్ చేసి వావ్ అనిపించారు. ఇప్పటికి అతని డాన్స్ స్టెప్పులు చాలా ప్రాధాన్యత ఉందంటే అతిశయోక్తి కాదు. ఏదేమైనా 7 దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఏఎన్నార్ కు మనం ఎంతో రుణపడి ఉంటాం.

మరింత సమాచారం తెలుసుకోండి: