తెలుగులో విజయ్ దేవరకొండ సరసన నటించి అందర్నీ మెప్పించింది అందాల ఐశ్వర్య రాజేష్. ఈమెకి తెలుగులోనే కాదు అంతకు మించి ఫాలోయింగ్ తమిళలో ఉంది. అక్కడ తమిళ సినిమాలో ఒక్క ఊపు ఊపేస్తోంది.  వరుసగా సినిమాలలో నటిస్తూ అదరగొట్టి పిచ్చెక్కిచ్చేస్తోంది ప్రేక్షకులని. అయితే విజయ్ సరసన నటించిన ఈమెకి అక్కడ క్రేజ్ ఎక్కువైపోయింది. దుమ్ము దులిపి అభిమానులని పెంచేసుకుంటంది ఐశ్వర్య రాజేష్. 

 

IHG

 

కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా ఈ భామ మంచి క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా ఎనలేని పేరు సంపాదించుకుంది. అటు సినిమాలలో హీరోయిన్ పాత్రల్లో ఇటు క్యారక్టర్ ఆర్టిసుగా నటిస్తోంది నటి ఐశ్వర్య. ఈ భామ తమిళలో నటిస్తూనే తెలుగులో కూడా మంచి స్థానాన్ని  దక్కించుకుంటోంది. ఇటీవలే ఈమె విజయ్ దేవరకొండ కలిసి నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ విడుదలైన సంగతి తెలిసినదే.

 

విజయ్ సరసన మంచి ఛాన్స్ కొట్టిన ఐశ్వర్య రాజేష్ వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో సువర్ణ  పాత్రలో నటించింది. ఆ పాత్రని ఎంతో చక్కగా చేసి మంచి పేరు పొంది మార్కులు కొట్టేసింది.     ఈ సినిమా కంటే ముందు క్రికెటర్ పాత్రలో నటించి పరిచయం అయినది. కౌసల్య కృష్ణమూర్తి సినిమా ద్వారా జనానికి చేరువైంది ఐశ్వర్య. అయితే ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్తో మరో సరి తెరపై కనిపించింది ఈ భామ.

 

IHG

 

ఇదంతా గతం అయితే ఇప్పుడు మరో పెద్ద స్థానాన్ని దక్కించుకోబోతోంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా  అందిన సమాచారం మేరకు ఈమె తమిళంలో ఒక భారీ ప్రాజెక్టులో నటించడానికి అవకాశం లభించినట్లు తెలియనుంది. అయితే ఈ సినిమాని దర్శకుడు రంజిత్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఐశ్వర్యకు హీరోయిన్గా అవకాశం వచ్చినట్లు స్పష్టం అవుతోంది. దర్శకుడు సతీష్ సినిమాని డైరెక్ట్ చేస్తాడట. 

మరింత సమాచారం తెలుసుకోండి: