సూపర్ స్టార్ రజనీకాంత్.. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణల మధ్య నలిగిపోతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అది నిజమే నట కానీ దానికి కారణం.. పర్సనల్ గా కాదట. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ ఎలా ఉందంటే.. పాత సూపర్ హిట్ సాంగ్స్ ను తీసుకుని కొత్తగా రీమేక్ చేయటం లాంటివి ఎక్కువ అయ్యాయి. అలానే పాత సినిమా పేర్లను ప్రస్తుత సినిమాలకు వాడుతూనే ఉన్నారు. అలానే మన తెలుగు ఆడియెన్స్ కూడా ఇలానే కోరుకున్నారనటానికి ఇప్పటి వరకూ వచ్చిన సినిమాలే నిదర్శనం. 

 

 

అది కాకుండా పెద్ద స్టార్ హీరో సినిమా టైటిల్ పెట్టుకుంటే సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనే కారణంతో ఆ ఫార్ములాను గుడ్డిగా ఫాలో అవుతున్నారు దర్శకులు. ఇప్పుడు ఆయన బాధపడుతుంది ఈ సమస్యతోనే నట. 

 

 

ప్రస్తుతం రజినీకాంత్ తమిళ దర్శకుడు శివ దర్శకత్వంలో ‘అన్నతే’అనే సినిమాలో చేస్తున్నాడు. అయితే.. తెలుగులో దీనికి అర్దం అన్నయ్య అని.. అందుకే రజినీకాంత్ తన సినిమాకు తెలుగు వెర్షన్‌ కు ‘అన్నయ్య’ అనే టైటిల్ దాదాపు ఖాయం చేస్తున్నట్లు టాలీవుడ్ లో వినిపించింది. కాగా., అన్నయ్య అనే టైటిల్ చిరంజీవి నటించిన పాత సూపర్ హిట్ సినిమా పేరు అది తెలుగు ప్రజలకు తెలిసిందే. అందుకు చిత్ర యూనిట్ ఈ సినిమాకు ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. పెద్దన్నయ్య టైటిల్ గతంలో బాలకృష్ణ హీరోగా నటించిన పాత సూపర్ హిట్ మూవీ.

 

 

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నతే’ సినిమాలో నలుగురు తమ్ముళ్లకు అన్నయ్యగా నటిస్తున్నాడు. రజినీకాంత్ సరసన సీనియర్ హీరోయిన్స్ ఖుష్బూ, మీనా నటిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాకు తెలుగులో ‘పెద్దన్నయ్య’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. మొత్తానికి రజినీకాంత్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు చిరంజీవి టైటిల్ పెట్టాలా.. లేకపోతే బాలకృష్ణ సినిమా టైటిల్ పెట్టాలా అనే చర్చలు నడుస్తున్నాయి. కాబట్టి మరి తలైవా సినిమాకి ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారా అనే దానిపై అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారనే చెప్పొచ్చు.. మరి ఈ సినిమాకు ఏ టైటిల్ ఫిక్స్ చేస్తారనేది వేచి చూడాల్సిన విషయమే..

మరింత సమాచారం తెలుసుకోండి: