టాలీవుడ్ లో శోభన్ బాబుకి ఉన్న ఇమేజ్ వేరు. ఎంత మంది అగ్ర హీరోలు ఉన్నా సరే ఆయన ఉవ్వెత్తున కెరీర్ లో ముందుకి వెళ్ళారు. అగ్ర హీరోగా అతి తక్కువ కాలంలో ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన సినిమాలకు అప్పట్లో మంచి క్రేజ్ ఉండేది. ఇక హీరోయిన్స్ కూడా ఆయన సినిమాల్లో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారని అంటూ ఉంటారు. శోభన్ బాబు కూడా చాలా మంది స్టార్ హీరోయిన్స్ తో సినిమాలు చేసారు. ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమాలు ఆయన చాలా చేసారు. ఈ సినిమాలు అన్నీ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ కొట్టాయి. 

 

ముఖ్యంగా శోభన్ బాబు జయప్రద కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు అన్నీ కూడా మంచి విజయాలను సాధించాయి అనే చెప్పుకోవచ్చు. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు కొన్ని ఉన్నాయి. 1982 లో వచ్చిన స్వయంవరం సినిమాలో ఇద్దరూ జీవించారు. ఆ సినిమా టీవీ లో వస్తే ఇప్పటికీ చూస్తూ ఉంటారు. ఇక శ్రీదేవి, జయప్రద తో ఆయన చేసిన దేవత సినిమా ఆయన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి ఆయనకు నటుడిగా కూడా మంచి సంతృప్తిని ఇచ్చిన సినిమాగా నిలిచింది. ఆ సినిమాలో ఆయన శ్రీదేవి, జయప్రద ని ఇద్దరినీ ప్రేమిస్తారు. 

 

అయితే అనుకోని పరిస్థితుల్లో ఆయన శ్రీదేవిని పెళ్లి చేసుకుంటారు. ముందు జయప్రదను ఇచ్చి పెళ్లి చెయ్యాలని ఆ సినిమాలో ఆయన తల్లి అనుకుంటారు. ఆయన మనసులో ఆ ఆలోచన ఉన్నా బయటపెట్టే వారు కాదు. చెల్లి సంతోషంగా ఉండలాని భావించిన జయప్రద ఆ సినిమాలో శోభన్ ని తన చెల్లికి ఇచ్చెయ్యాలి అనుకుంటారు. అయినా సరే శ్రీదేవి వాళ్ళను దూరం చెయ్యడం ఇష్టం లేక మోహన్ బాబుని వివాహం చేసుకుంటుంది. ఆ సినిమాలో జయప్రద, శ్రీదేవి, శోభన్ బాబు పక్కన జీవించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: