ప్రస్తుతం మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాతో పాటు షార్ట్‌ ఫిలింస్‌, వెబ్‌ సిరీస్‌ల ట్రెండ్‌ కూడా బాగా నడుస్తోంది. అందుకే టాప్‌ స్టార్‌లు కూడా షార్ట్‌ ఫిలింస్‌లో నటించేందుకు ముందుకు వస్తున్నారు. బాలీవుడ్ సీనియర్‌ హీరోయిన్‌ కాజోల్‌, సౌత్ బ్యూటీ శృతిహాసన్‌లు నటించిన లఘు చిత్రం దేవి. తొమ్మిది విభిన్న నేపథ్యాల నుంచి వచ్చిన తొమ్మిది మంది మహిళలు అనుకొని పరిస్థితుల్లో ఒక దగ్గర కలవటం. ఒకరి కథలు ఒకరు, ఒకరి జీవితంలో ఎదురైన సమస్యలు మరొకరు తెలుసుకొని అక్కా చెల్లెలుగా దగ్గరవ్వటం ఈ షార్ట్ ఫిలిం కథాంశం.

 

ప్రియాంక బెనర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలిం ను నిరంజన్‌ అయ్యంగార్‌, రేయన్‌ ఇవన్‌ స్టీఫెన్‌లు సంయుక్తంగా నిర్మించారు. అయితే ఈ షార్ట్‌ ఫిలిం కథ తనదే అంటూ ఓ ఫిలిం మేకర్‌ స్టూడెంట్‌ ఆరోపించాడు. 2018లో తానే స్వయంగా రాసి దర్శకత్వం వహించిన ఫోర్‌ అనే షార్ట్‌ ఫిలింకు దేవీ షార్ట్‌ ఫిలింకు చాలా పోలికలు ఉన్నాయంటూ తన ఫేస్‌ బుక్‌ పేజ్‌లో కామెంట్ చేశాడు అభిషేక్ రాయ్.

 

`ఈ సందర్భంగా నేను ఓ విషయం మీ దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నాను. మేము అండకర్రీ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఓ లఘు చిత్రాన్ని నిర్మించాము. మేము స్కూల్‌లో ఉండగానే ఫోర్‌ పేరుతో ఈ లఘు చిత్రం తెరకెక్కించాం. అప్పటికే ఒక రూంలో ఉన్న అత్యాచార బాధితుల దగ్గరకు కొత్తగా మరో బాదితురాలు రావటం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. తాజాగా దేవీ అనే లఘు చిత్రం విడుదలైంది. ఈ షార్ట్‌ ఫిలింకు మా షార్ట్‌ ఫిలింకు చాలా పోలికలున్నాయి. మా కథను అలా కాపీ చేసి చిత్రీకరించటం అన్యాయం` అంటూ కామెంట్ చేశాడు అభిషేక్‌ రాయ్‌. అయితే ఈ ఆరోపణలపై దేవీ చిత్రయూనిట్ ఇంత వరకు స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: